ఆంధ్రాకు చెందిన ఒక్క నీటిబొట్టూ కూడా వాడం!

5

– ఆంధ్రాబాబులూ.. ఎందుకు హైరానా!?

నిజామాబాద్‌,మే5(జనంసాక్షి):  తెలంగాణ వాటా తప్ప ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక్క నీటి బొట్టును కూడా తెలంగాణ వాడుకోదని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. మనకు కేటాయించిన నీటి కోసమే ప్రాజెక్టులను ప్లాన్‌ చేశామని అన్నారు. అయితే దీనిని కూడా సీమాంధ్ర నేతలు తట్టుకోలేక యాగీ చేస్తున్నారని మండిపడ్డారు. మనవాటా నీళ్లపైనా వారు ఆందోలన చేయడం దారుణమన్నారు. బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్‌ మండలం నాచుపల్లిలో మిషన్‌ కాకతీయ పనుల ప్రారంభోత్సవంలో మంత్రులు హరీష్‌ రావు, పోచారం శ్రీనివాసరెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా చంద్రబాబు కుట్రలు ఆగడం లేదన్నారు. బచావత్‌ తీర్పు ప్రకారమే నీటి వాటాను వాడుకుంటున్నామని తెలిపారు.  తెలంగాణ ఏర్పడ్డా చంద్రబాబు కుట్రలు ఆగడం లేదని  ఆరోపించారు.  బచావత్‌ ట్రైబ్యునల్‌ తీర్పు ప్రకారమే నీటి వాటాను వాడుకుంటున్నామన్నారు. ఏపీ మంత్రి దేవినేని ఉమకు ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా చర్చకు రావటం లేదని… కూర్చుంటే వాస్తవాలు బయటకొస్తాయనే ఏపీ ప్రభుత్వం చర్చకు ముందుకు రావడం లేదని ఆరోపించారు. తెలంగాణలోని ప్రాజెక్టులు అక్రమమైతే ఏపీలోని ప్రాజెక్టులు ఏ అనుమతితో కట్టారని ప్రశ్నించారు. ఏపీకి చెందిన ఒక్క నీటిబొట్టు కూడా తెలంగాణ వాడుకోదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. చంద్రబాబు, జగన్‌ రాజకీయాల కోసం తెలంగాణను పావుగా వాడుకోవద్దని కోరారు. ఏపీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఆపేది లేదన్నారు. చంద్రబాబును సమర్ధిస్తారో.. తెలంగాణ పక్షాన ఉంటారో తెదేపా నేతలు తేల్చుకోవాలన్నారు. ప్రాజెక్టుల విషయంలో విూకో న్యాయం… మాకో న్యాయమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మిషన్‌ కాకతీయ విప్లవంలా సాగుతోందని.. వచ్చే రెండేళ్లలో తెలంగాణలోని ప్రాజెక్టుల రూపురేఖలు మార్చుతామన్నారు. వచ్చే రెండేళ్లలో కోటి ఎకరాలకు సాగునీరందించి తీరుతామన్నారు. గతంలో కాళ్లరిగేలా తిరిగినా చెరువుల పునరుద్ధరణకు నిధులివ్వలేదన్నారు. తెలంగాణలోని ప్రాజెక్టులు అక్రమమైతే ఏపీలోని ప్రాజెక్టులు ఏ అనుమతితో కట్టారు అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల విషయంలో విూకో న్యాయం.. తమకో న్యాయమా అని అడిగారు. చంద్రబాబు, జగన్‌ రాజకీయాల కోసం తెలంగాణను పావుగా వాడుకోవద్దన్నారు. ఏపీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపబోమని తేల్చిచెప్పారు.  మిషన్‌ కాకతీయ విప్లవంలా కొనసాగుతుందన్నారు. దీంతో రానున్న రోజుల్లో భూగర్భ జలాలు గణనీయంగా పెరుగు తాయన్నారు. వచ్చే రెండేళ్లలో తెలంగాణలోని ప్రాజెక్టుల రూపురేఖలు మార్చుతామని పేర్కొన్నారు. టీ టీడీపీ నేతలు చంద్రబాబును సమర్థిస్తారో.. తెలంగాణ పక్షాన ఉంటారో తేల్చుకోవాలన్నారు. వచ్చే రెండేళ్లలో కోటి ఎకరాలకు సాగు నీరందించి తీరుతామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఉద్ఘాటించారు. పనుల ప్రారంభం సందర్భంగా పోచారం మాట్లాడుతూ.. గతంలో కాళ్లరిగేలా తిరిగినా చెరువుల పునరుద్ధరణకు నిధులివ్వలేదని గుర్తు చేశారు. ఇప్పుడు ఒక్క బాన్సువాడ నియోజకవర్గానికే రూ. 65 కోట్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది అని తెలిపారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులన్నింటినీ అనుకున్న సమయంలో పూర్తి చేస్తామన్నారు. రైతాంగ సంక్షేమం కోసం వెయ్యి కోట్లతో ప్రతి మండలంలో గోడౌన్లను నిర్మిస్తున్నామని, విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. భూగర్భ జలాలు పెంచి సాగు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా మిషన్‌ కాకతీయ ద్వారా చెరువు పూడికతీత పనులను చేపడుతున్నామని తెలిపారు. తొమ్మిది గంటల పాటు వ్యవసాయానికి నాణ్యమైన పగటిపూట ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని వివరించారు. ప్రస్తుత వేసవిలో సైతం గోదావరి నుంచి నీరు వృథాగా సముద్రంలోకి వెళ్తోందని, దీన్ని గమనించి వేగవంతంగా ప్రాజెక్టులు నిర్మించి తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక్క క్షణం కూడా మమ్ముల్ని, అధికారులను నిద్రపోనివ్వడంలేదని అన్నారు.