ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వండి
– ఎంపీ కవిత
విజయవాడ,ఆగస్టు 18(జనంసాక్షి): ఏపీకి ప్రత్యేక ¬దా ఇవ్వాల్సిందేనని నిజామాబాద్ ఎంపి కవిత అన్నారు. ప్రత్యేక¬దా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హావిూని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని ఎంపీ కవిత అన్నారు. గురువారం కృష్ణాజిల్లా నందిగామ శివారు అనాసాగరంలో ప్రైవేటు ఫంక్షన్‌కు హాజరైన ఆమె విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక ¬దా ఇస్తామని అప్పటి ప్రభుత్వం హావిూ ఇచ్చిందని.. దానిని అమలు చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందన్నారు. సాంకేతికంగా ¬దా ఇవ్వడం సాధ్యం కాకపోయినా రాజకీయమైన నిర్ణయం తీసుకొని ఇవ్వొచ్చని సూచించారు. ఈ విషయంలో బిజెపి ప్రభుత్వం త్వరగా నిర్ణయం తసీఉకుని ఎపికి న్యాయం చేయాల్సి ఉందన్నారు. ప్రత్యేక¬దా కోసం పార్లమెంటులో చేస్తున్న ఆందోళనకు తాము పరోక్షంగా మద్దతిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ¬దాకు తాము వ్యతిరేకం కాదని కూడా అన్నారు. తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయినప్పటికీ ప్రజల మధ్య సోదర భావం నెలకొందని వివరించారు. కేవలం పరిపాలనా సౌలభ్యం కోసమే రాష్ట్ర విభజన జరిగిందని.. మిగిలిన అన్ని విషయాల్లో తెలుగు ప్రజలంతా ఒక్కటిగానే ఉంటారని చెప్పారు.అలాగే ఉండాలని తాను కోరుకుంటానని అన్నారు.