ఆంధ్రా పార్టీ ఒకటి అంతర్థానం: కేటీఆర్
ఖమ్మం: ఖమ్మం జిల్లా ప్రజల ఆశీర్వాదంతో జిల్లాలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదుగుతామని తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెరాసలో చేరేందుకు రంగం సిద్ధమైన నేపథ్యంలో కేటీఆర్ పొంగులేటి నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొంగులేటిని తెరాసలోకి ఆహ్వానించేందుకే తాను ఇక్కడికి వచ్చానని అన్నారు. పొంగులేటి, వెంకటేశ్వర్లు చేరికతో ఖమ్మం జిల్లాలో తెరాస మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చేరికలతో తెలంగాణలో ఆంధ్రా పార్టీ ఒకటి అంతార్థనం మైందని, భవిష్యత్తులో తెలుగుదేశం కూడా ఇలాగే అంతర్థానమవుతుందని కేటీఆర్ విమర్శించారు.