ఆంధ్రóప్రదేశ్‌లో రైతు ఆత్మహత్యల ‘అభివృద్ధి’
(సోమవారం సంచిక తరువాయి)
ఆత్మహత్యలు-ఆహార భద్రత
రైతు ఆత్మహత్యల నేపథ్యాన్ని, ఆకలి చావుల నేపథ్యాలను వేరువేరుగా చూడాల్చి ఉన్నప్పటికీ వీటి మధ్య ఉన్న సారూ పత్యలను గమనిస్తే ఈ రెండూ కూడా భారత వ్యవసా యరంగంలో తీసుకుంటున్న విధానాల ఫలితమే అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో విధాన నిర్ణే తలు వ్యవసాయరంగంపై వహిస్తున్న నిర్లక్ష్యంవ్యవసాయం మీద ఆధారపడిన ప్రజలను, ముఖ్యంగా భూమిలేని పేదవర్గాలను, చిన్న, సన్నకారు రైతాంగ్నా, స్త్రీలను,దళితులను, ఆదివాసీ సమూ హాలను సంక్షోభంలోనికి నెట్టివేస్తోంది. రాష్ట్రంలోని ఆదిలాబా ద్‌లాంటి ఎర్రనేలల ఆదివాసీప్రాంతాలలో కూడా సాంప్రదాయ ఆహార పంటల స్థానంలో పత్తి పంటల ప్రవేశం దీనికి పెద్ద ఉదా హరణ. ఫలితంగా ఒక కనిపించిన సంక్షోభం అక్కడి ఆదీవాసీ సమూహాన్ని నిశ్శబ్దంగా నిర్మూలిస్తోంది, ఆహారలేమి తీవ్ర స్థాయిలో ఉంది దానితో రక్తహీనతతో చనిపోతున్న గర్భిణులు, నవజాత శిశువుల సంఖ్య ప్రమాదకరంగా ఉంది దేశ జనాభా మొత్తనికి నిజమైన ఆహారభద్రత అంటే అనేక విషయాలుం టాయి, ఇవన్నీ కూడా ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యం అవు తాయి అవసరమైన ఆహార పదార్థాల పంపిణీ జరగాలంటే అందు కుతగినట్టు వ్యవసాయ ఉత్పత్తి పెరగాల్సి ఉంటుంది వాణిజ్యానికి అవసరమైన ఒకటి రెండు పంటలు మాత్రమే కాకుండా వైవిధ్య భరితమైన పంట వైపు మళ్లాలి, ఇది స్థానిక స్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ జరగాలి. అన్ని వర్గాల ప్రజలకూ ఆహారం అందుబాటులో ఉండేలా చూడడం అంటే అందరిలోనూ అవస రమైన ఆహార పదార్థాలను కొనుగోలు చేయగల సామర్థ్యం పెర గాలి. మరోమాటలో చెప్పాలంటే ఉపాధి ప్రముఖ వ్యవసాయ ఆర్థి క శాస్త్రవేత్త జయతి ఘోష్ (ది పొలిటికల్ ఎకానమీ ఆఫ్ హంగర్ ఇన్ ట్వంటీఫస్ట్ సెంచరీ ఇండియా, ఇపిడబ్ల్యు, అక్టోబరు,2010 సంచిక)లో విశ్లేక్షషించారు.
ఇప్పుడు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో వ్యవసాయం ఎదుర్కొంటున్న పరిస్థితులు ఇవే. ఈ పరిస్థితులు చాలా పెనుసవాళ్లను మనముందు ఉంచుతున్నాయి. భారతదేశ జనాభాలో మూడొంతుల మంది వ్యవసాయం మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడివున్నారు. వ్యవసాయం కాలానుగుణంగా నడ వాల్సిన విషయం. వాతావరణ మార్పులు, పరిస్థితులు చాలా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ప్రభుత్వాలు ఈ అంశాన్ని దృష్టిలోకి తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాయి. దీనితో పాటు భూసారం, వేస్తున్న పంటలు, భూసారానికి అనుగుణంగా వేయాల్సిన పంటలు, నీటిసౌకర్యం, విత్తనాలు, ఎరువులు, పంట దిగుబడి, మార్కెట్ వ్యవ స్థ ఇవన్నీ ఒక దానితో ఒకటి ముడిపడి ఉన్న అంశాలు, వీటితో పా టు మరోముఖ్యమైన విషయం కాలానుగుణంగా మారుతూ వస్తున్న వ్యవసాయ ఉత్పత్తి వర్గాలు. ఒకప్పటి సాంప్రదాయ వ్యవసాయ వర్గాలేవైతే వున్నాయో అవి క్రమంగా వ్యవసాయం నుంచి తప్పు కుంటున్నాయి కానీ భూ యాజమాన్యాన్ని వదులుకోవడం లేదు ఇది సంప్రదాయ కులవృత్తుల్లో ఉన్నవర్గాలు. వ్యవసాయాన్ని తమ జీవనాధారంగా ఎంచుకుంటున్న పరిస్థితి దేశవ్యాపితంగా కనిపి స్తోంది.ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ పరిస్థితికి వస్తే మూడింట రెండొంతుల మంది రాష్ట్ర ప్రజల ప్రధాన జీవనాధా రంవ్యవ సాయమే. రాష్ట్ర స్థూలోత్పత్తిలో మూడొంతులు దీని నుంచే వ స్తుంది. అయితే అనేక కారణాల రీత్యా వ్యవసాయంభూమి తరిగిపో తోంది. వ్యవసాయేతర కారణాలకు భూమిని బదలాయింపు చేయడం, రియల్ ఎస్టేట్ వంటి వ్యవహారాలు దీనికి కారణం. జాతీయ స్థాయిలో వచ్చిన విధాన నిర్ణయాలను, నూతన ఆర్థిక విధా నాలను ముందుగాఅమలు పరిచినది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. ఆహార పంటల స్థానంలో పెద్ద ఎత్తున వాణిజ్య పంటలు ఆక్రమించాయి. వరి పంటను కూడా వాణిజ్య అవసరాలకోసమే పండించడం జరు గుతోంది. ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగాయి మార్కెట్ మీద ఆధారపడడం ఎక్కువయింది.82 శాతం రైతులు రుణభారంలో వు న్నారు.చిన్న సన్నకారు రైతులు రుణభారంలో వున్నారు. చిన్న సన్న కారు రైతులు వ్యవసాయాన్ని నిర్ణయించే స్థితిలో లేరు. భౌగోళిక ప్రాంతాల ప్రత్యేకఅంశాలను గమనంలోకి తీసుకోకుండా ఏకీకృత విధానం అమలు పరచడంతో మెట్టప్రాంతాల రైతాంగం అధిక పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్కెట్‌ల కోసమే విధానాల రూప కల్పన జరుగుతోంది కానీ క్షేత్రస్థాయి ప్రత్యేకతలను, అవస రాలను దృష్టిలోకి తీసుకోవడం లేదు.గుంటూరు, ప్రకాశంలాంటి జిల్లాల్లోని రైతులు పెద్ద ఎత్తున వాణిజ్య పంట అయిన పత్తి వైపు మళ్లారు. విపరీతంగా పురుగు సోకటంతో ఎన్ని మందులు వాడినా ఫలితం రాక అక్కడ పత్తిపంట విఫలమవడంతో దాదాపు 100 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి వల సల రూపంలో తెలంగాణ ప్రాంతానికి పూర్తి వ్యాపార పంట అయి న ఈ హైబ్రిడ్ పత్తి పంటను పరిచయం చేస్తూ వచ్చారు. దీనికి కారణం ఇక్కడ భూమి కౌలుకి గానీ చౌకగా కొనడానికి గానీ చౌకగా దొరకటమే వీరిని చూసి మొదట్లో కేవలం పెట్టుబడి పెట్టగల స్థానిక ధనిక రైతులే పత్తి పంటను అందుకున్నారు. ప్రారం భంలో వలసవచ్చిన రైతులతో పాటు, స్థానిక ధనిక రైతులు అత్యధి క లాభాలను ఆర్జించడం చూసిన చిన్న సన్నకారు రైతాంగా కూడా పూర్తిగా పత్తి పంట వైపు మళ్లారు. వ్యాపార పంటల ఆగమనంతో వ్యవసాయ పద్ధతులలోనూ, స్థానిక రైతుల జీవన విధానంలోనూ పెద్దఎత్తున మార్పులు చోటుచేసుకున్నాయి. స్వయంసిద్ధ, ఆహార పంటల సుస్థిర జీవనవిధానంలోకి పురుగు మందులు, రసాయనిక ఎరువుల కంపెనీలు, ఆయా కంపెనీల డీలర్లు, అప్పుదారులు, కమిషన్ ఏజంట్లు, బ్యాంకులు ప్రవేశంచాయి సంప్రదాయ విత్తన తయారీ పద్దతులకి స్థానిక రైతులు దూరమయి పోయారు.
పౌరస్పందన, జయతి ఘోష్ కమిషన్
1980లలో ప్రకాశం, గుంటూరు జిల్లాలలో ప్రారంభమయిన రైతుల ఆత్మహత్యలు రాష్ట్రంలోని అనేక జిల్లాలకు విస్తరించి ప్రతి సంవత్సరం పెరుగుతూనే వున్నా యి. 1998లో వరంగల్ జిల్లాలోని సామాజిక కార్యకర్తలు, మేధావులు, జర్నలిస్టులు, యూనివర్సిటీ అధ్యాపకులు రైతు సేవా సమితి పేరుతో జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కుంటు బాలను సందర్శించి ఆయా కుంటుబాలకు కొంత ఆర్థిక సహాయం అందజేశారు. రైతులకు న్యాయం జరగాలి పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిపారు రైతు సహాయ కమిటీ పేరుతో హైదరాబాద్ కేంద్రంగా మరో ప్రయత్నం మొదలయింది. ఈ కమిటీ పేరుతో సభ్యులు ఆత్మహత్య బాధిత కుంటుంబాలను కొంత ఆర్థిక సహాయంతో అదుకోవడంతో పాటు అన్ని జిల్లాలలో సమస్య పూర్వాపరాలను విచారించిరు. 1998 సంవత్సరంలో జులై నెలలో రైతు ఆత్మహత్యల మీద ఈ కమిటీ ఆధ్వర్యంలో ఒక స్వతంత్ర ప్రజా బహిరంగ విచారణ నాలుగు ప్రాంతాలలో జరిగింది. అవి, మెదక్ (30-3-98), వరంగల్ (16-4-98), గుంటూరు (7-5-98), హైదరాబాద్ (17-5-98) ఈ ట్రిఋ్యనల్‌లో సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ పి.ఏ. చౌదరి, రిటైర్డ్ ఐఏయస్ అధికారు శంకరన్, కె.ఆర్.వేణుగోపాల్, ప్రముఖ సంపాదకులు ఎ.బి.కె.ప్రసాద్, స్వాతంత్ర సమరయోధులు, విద్యావేత బూర్గుల నరసింగరావు వ్యవహరించారు. ఈ ట్రిబ్యునల్ తన రిపోర్టును ప్రభుత్వానికి అందజేసింది.
ట్రిబ్యునల్ రిపోర్టులోని ముఖ్యాంశాలు
– జరిగిన రైతు ఆత్మహత్యలేవీ కూడా వ్యక్తిగత, మానసిక, దుందుడుకు నిర్ణయాలు కావు.
– పంటనష్టాలతో చిన్నరైతులు రుణభారంలోకి వెళ్లిపోతున్నారు. ఆదుకోవలసిన ప్రభుత్వాల నుంచి ఏ మాత్రం సహాయం అందటం లేదు. పౌరులందర్నీ అన్నిరకాల అణచివేతలు, దోపీడీల నుంచీ రక్షించాల్సిన బాధ్యత, అభివృద్ధిపథంలో జీవించడానికి అవకాశాలు కల్పించవలసిన బాధ్యత రాజ్యంగ బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలది.
– రైతు జీవితం ఆత్మాభిమానంతో ఉంటుంది. తమ జీవనోపాధుల్ని కోల్పోతున్న రైతాంగం బానిస బతుకుల్లోకి వెళ్లాడానికి సిద్ధంగా లేరు.
– రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నా గానీ ప్రభుత్వం ఇంతవరకూ ఏ రకమైన ప్రత్యేక చర్యలూ తీసుకోలేదు,రైతాంగానికి భరోసా ఇచ్చే ప్రయత్నాలు చేయలేదు.
– వ్యవసాయ విస్తరణ సేవలు రైతులకు సహాయపడడంలో, పంటలు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల విజ్ఞానాన్ని అందించడంలో పూర్తిగా విఫలమయ్యాయి.
– పెరుగుతున్న వ్యాపార సంస్క్సతిలో ఒంటరివావుతున్న రైతులు, గ్రామీణ జీవితంలో విచ్చిన్నమవుత్ను ఉమ్మడిసామాజిక విలువలు.
– కె.సజయ, రమ మెల్కోటె, బి.కొండల్‌రెడ్డి
(వీక్షణం సౌజన్యంతో…)
(తరువాయి భాగం రేపటి సంచికలో)