ఆకతాయిలపై కఠిన చర్యలు జిల్లా షీ టీం ఇన్చార్జి ఎస్ఐ సుధామాధురి

 

మక్తల్ జూలై 26 (జనంసాక్షి) ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా షీ టీం ఇన్చార్జ్ సుధా మాధురి అన్నారు. పట్టణంలోని అక్షర హైస్కూల్లో విద్యార్థులకు ర్యాగింగ్ వేధింపులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాలలు, పాఠశాలలు, బస్టాండ్ లో నిర్మానుష ప్రాంతాల్లో ఎవరైనా మహిళలు, విద్యార్థులను ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, వేధింపులకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు. మహిళపై ఇటీవల సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టి శారీరకంగా మానసికంగా వేధిస్తున్నారని అలాంటి వారికి బుద్ధి చెప్పడానికి జిల్లాలో షీ టీంలు పనిచేస్తున్నాయన్నారు. విద్యార్థులు సెల్‌ఫోన్ వినియోగం ఎక్కువగా చేస్తున్నారని సోషల్ మీడియాకు అలవాటు పడి సమయం వృధా చేసుకోవద్దన్నారు. విద్యార్థినులు పాజిటివ్ ఆలోచనలతో జీవితంపై ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని ఏదైనా ఉద్యోగం సాధించాలన్న పట్టుదల పెట్టుకోని చదివి తల్లిదండ్రులకు సమాజానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఎవరైనా విద్యార్థినిలు ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, వేధింపులకు గురి చేస్తే వెంటనే షీ టీం హెల్ప్ లైన్ నెంబర్ 7901022492 కు లేదా డైల్ 100 కి ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థినులు షీ టీం పోలీసులు తదితరులు పాల్గొన్నారు