ఆకస్మిక తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్ దివాకర
మహాదేవపూర్. సెప్టెంబర్22. (జనంసాక్షి)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆడిషనల్ కలెక్టర్ దివాకరా గురువారం సాయంత్రం మహాదేవపూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఆకస్మికంగా సందర్శించారు,బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చే ఇవ్వబడుచున్న బతుకమ్మ చీరలను గ్రామములలో పంపిణీ చేయుటకు ముందస్తు ఏర్పాట్ల పై అధికారులతో సమీక్షా చేపట్టారు, చీరల పంపిణీ పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 24. నుండి గ్రామంలలో బతుకమ్మ చీరల పంపిణీ చేయుటకు అన్ని ఏర్పాట్లు చేయాలని తహశీల్దార్ శ్రీనివాస్ ను ఆదేశించారు. వర్షాలు తీవ్రంగా పడుతున్నందున ప్రతి గ్రామపంచాయతీలో అంటురోగాలు, విష జ్వరాలు ప్రబలకుండా గ్రామంలో ఎప్పటికప్పుడు శానిటేషన్ చేపట్టాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేటట్లుగా ప్రజలను అప్రమత్తం చేయాలని పంచాయతీ కార్యదర్శులకు తగు ఆదేశంలు జారీ చేయాలని ఎంపీడీవో సూచించినారు.ఉపాధి హామీ పథకం కింద గ్రామపంచాయతీలకు ఇచ్చిన టార్గెట్ మేరకు హరితహారం కార్యక్రమంలో భాగంగా చెట్లు నాటే కార్యక్రమం వారం రోజుల లోగా పూర్తి చేయాలని గత సంవత్సరం నాటిన మొక్కలలో చనిపోయిన మొక్కలను గుర్తించి రిప్లేస్మెంట్ చేయాలని మరియు నాటిన మొక్కల చుట్టూ నీరు నిలుచుటకు వీరుగా వాచర్ల ద్వారా సాసర్ పర్మేషన్ చేయించాలని అధికారులను ఆదేశించారు.హరితహారం కింద నాటిన ప్రతి మొక్క బతికేతట్లు చూడాల్సిన బాధ్యత గ్రామపంచాయతీలదే అయినందున గ్రామపంచాయతీలు, నాటిన మొక్కలను సంరక్షించుటకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిర్లక్ష్యం చేసినచో బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని అన్నారు. ఈ సమావేశంలో మండల పరిషత్ అధ్యక్షులు రాణి బాయి, ఎంపిడిఓ శంకర్ నాయక్, తాసిల్దార్ శ్రీనివాస్, ఏపిఎం రవీందర్, ఉపాధిహామీ సిబ్బంది, తదితరులు ఉన్నారు