ఆగష్టు12 నుంచి తిరుమలలో మహాసంప్రోక్షణ
– వెల్లడించిన టీటీడీ ఈవో సింఘాల్
తిరుమల, జులై6(జనం సాక్షి) : ఆగష్టు 12నుంచి 16వరకు శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో సింఘాల్ తెలిపారు. ఐదు రోజుల పాటు శాస్తోక్తంగా పూజాది కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. నేపథ్యంలో శ్రీవారి దర్శనం చాలా పరిమితంగా వుంటుంది ఆయన అన్నారు. ఈ నెల 10, 24న వయోవృద్ధులకు, 11, 25న చంటి బిడ్డ తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నట్లు ఈవో తెలిపారు. సర్వదర్శనం స్లాట్ ద్వారా ప్రతి నెల 5.5 లక్షల మందికి శ్రీవారిదర్శన భాగ్యం కలుగుతోందని అన్నారు. కురుక్షేత్రంలో రూ.30 కోట్లతో శ్రీవారి ఆలయ పనులు పూర్తి చేశామని, కురుక్షేత్రంలో శ్రీవారి విగ్రహ ప్రతిష్ట చేశామని తెలిపారు. అలాగే కన్యాకుమారి, హైదరాబాద్‌లో శ్రీవారి ఆలయాల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. అలిపిరి నడక మార్గంలో 10వేల మొక్కలు నాటామని టీటీడీ ఈవో సింఘాల్ పేర్కొన్నారు. ఈ నెల 1న శ్రీవారి విగ్రహ ప్రతిష్ట చేసాం… ప్రతి నిత్యం 5 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారన్నారని తెలిపారు.
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల..
2018 అక్టోబర్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో తితిదే విడుదల చేసింది. మొత్తం 53,642 సేవా టికెట్లను విడుదల చేసింది. ఎలక్టాన్రిక్ లాటరీ విధానం కింద 9,742 సేవా టికెట్లను కేటాయించింది. సుప్రభాతం కింద 7,597, తోమాల కింద 90, అర్చన కింద 90 టికెట్లను విడుదల చేశారు. అష్టాదళ పాదపద్మారాధనకు 240, నిజపాద దర్శనానికి 1725, కరెంటు బుకింగ్‌కు 43,900 ఆర్జిత సేవా టోకెన్లు కేటాయించారు. వసంతోత్సవానికి 11 వేల టికెట్లు, సహస్త్ర దీపాలంకరణకు 12 వేల టికెట్లు అందుబాటులో ఉన్నాయి.