ఆగస్టు ఒకటవ తేదీన వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముట్టడి

    – జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు
హుజూర్ నగర్ జులై 20 (జనం సాక్షి): ఆగస్టు ఒకటవ తేదీన పేద వ్యవసాయ కార్మికులకు ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని, పెండింగ్ లో ఉన్న ఉపాధి హామీ పథకం లోని బిల్లులు చెల్లించాలని డిమాండ్  చేస్తూ వామపక్ష వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా  నిర్వహిస్తున్నట్లు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు రేమిడాలరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు వెల్లడించారు. బుధవారం నాడు ఆయన హుజూర్ నగర్  సిపిఐ కార్యాలయం అనుమాల లింగయ్య భవన్ లో పాత్రికేయులతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయాన్ని వృత్తిగా నమ్ముకుని జీవిస్తున్న  పేద వ్యవసాయ కార్మికులెందరో కూడు గూడు గుడ్డ లేక అలమటిస్తున్నా రని వారందరినీ గుర్తించి వారందరికీ నివాస యోగ్యమైన ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, ఎంతో కాలంగా పెండింగ్  లో ఉన్న ఉపాధి బిల్లును తక్షణమే  చెల్లించాలని, ఉపాధి కూలీలకు సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలని, రోజుకు 600 రూపాయలు వేతనం ఇవ్వాలని, వారికి ఉచిత ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని, పట్టణ ప్రాంతాలకు కూడా ఉపాధి హామీ పథకాన్ని విస్తరింప చేయాలని, కుటుంబంలో ఎంతమంది జాబ్ కార్డు కొరకు అప్లై చేస్తే అందరికీ జాబ్ కార్డు ఇచ్చి  అందరికీ పని కనిపించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట హుజూర్ నగర్ పట్టణ సిపిఐ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి  జడ వెంకన్న, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిలక రాజు శ్రీను, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యుడు కొండ అంజయ్య  తదితరులు ఉన్నారు.
Attachments area