ఆగస్టు 7న ఢిల్లీలో అఖిల భారత జాతీయ ఓబిసి మహాసభ.

బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ డి.అరవింద్ చారి.
ఓబిసీ జాతీయ మహాసభల గోడపత్రిక విడుదల.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై26(జనంసాక్షి):
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బీసీ సంఘాల ఆధ్వర్యంలో బీసీ సమస్యలపై సమగ్రంగా చర్చించి,బీసీలు సంఘటితం కావడానికి వచ్చేనెల ఆగస్టు ఏడో తేదీన తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని తలకటూర్ స్టేడియంలో పదివేల మంది బీసీ ప్రతినిధులతో జరిగే జాతీయ ఓబిసి మహాసభ విజయవంతం కావాలని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా కన్వీనర్ డి.అరవింద్ చారి వాల్ పోస్టర్లను బీసీ సంక్షేమ సంఘం నాయకులతో కలిసి విడుదల చేశారు.ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా కన్వీనర్ డి.అరవింద్ చారి మాట్లాడుతూ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి దేశవ్యాప్తంగా బీసీలు ఎదుర్కొంటున్న డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించడానికి అఖిలభారత జాతీయ ఓబీసీ మహాసభలు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అందులో భాగంగానే దేశంలోని 29 రాష్ట్రాల ప్రతినిధులతో ఆగస్టు 7వ తేదీన ఈ మహాసభను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఓబిసి మహాసభ ద్వారానైనా కేంద్రం మంత్రిత్వ శాఖ,బీసీ జన గణన చట్ట సభల్లో బీసీ రిజర్వేషన్లు తదితర డిమాండ్లు సాధించాలని తెలిపారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు రామకృష్ణ. మల్లికార్జున్. యాదగిరి. శ్యాంసుందర్. సుదర్శన్. శివశంకర్. నరేష్. మరియు మహిళా సంఘం నాయకులు జ్యోతి. సైదా. బేగం. విజయరాణి. గాయత్రి తదితర నాయకులు పాల్గొన్నారు.