ఆగస్ట్ 9న క్విట్ బిజెపి ఆందోళన: సిఐటియూ
కడప,జూలై7(జనం సాక్షి): పెట్టుబడిదారులే పాలించే విధంగా, కార్మికులను బానిసలు చేసేందుకు బిజెపి కుట్ర చేస్తుందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ అన్నారు. రాబోయే రోజుల్లో బిజెపిని గద్దె దించేందుకు కార్మికులు అందరూ ఏకం అవుతున్నారని తెలిపారు. ఆగస్ట్ 9 న క్విట్ బిజెపి అనే నినాదంతో జైల్ భరో నిర్వహించనున్నామని చెప్పారు. కడపలో సిఐటియు ఆధ్వర్యంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఇందులో గఫూర్ మాట్లాడుతూ…దేశంలో 2014 లో బిజెపి అధికారంలోకి వచ్చాక అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుందన్నారు. కార్మిక వ్యతిరేక పార్టీ బిజెపి అని, చట్టాలను సైతం మార్పు చేస్తూ కార్మికులపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. సెప్టెంబర్5 న లక్షలాది మంది కార్మికులు, రైతులతో ఢిల్లీలో మహా నిరసన ప్రదర్శనలు చేయనున్నామని పేర్కొన్నారు. జిల్లాలో ప్రభుత్వ రంగ ఉక్కు పరిశ్రమ కావాలి తప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకుంటున్నట్లుగా ప్రయివేటు రంగపరంగా పెట్టాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. ప్రత్యేక ¬దా ఇవ్వలేమన్న బిజెపి ఇప్పుడు ఎందుకు ఊరేగింపులు చేస్తుందో చెప్పాలన్నారు.