ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఆవిష్కరణకు
కడప కడప నుండి తరలి రావాలి
పద్మశాలి సంఘం అధ్యక్షులు గోలి వెంకటరమణ.
రాజన్నసిరిసిల్లబ్యూరో సెప్టెంబర్ 26. (జనం సాక్షి) నేడు సిరిసిల్ల పట్టణంలో జరగనున్న ఆధ్వర్యంలో ప్రజలు పద్మశాలి కుల బంధువులు గడప గడప నుండి భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పద్మశాలి సంఘం అధ్యక్ష కార్యదర్శులుగోలి వెంకటరమణ, మండల సత్యం కోరారు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ పద్మశాలి సామాజిక వర్గం నుంచి ఎదిగొచ్చిన ఆదర్శ నేత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ప్రతిష్టాపన విద్యానగర్ బైపాస్ లో నేడు జరగనుందని తెలిపారు ఆవిష్కరణ కోసం ఐటీ మున్సిపల్ భారీ పరిశ్రమ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హాజరవుతున్నట్లు తెలిపారు. సిరిసిల్ల పట్టణం జిల్లాలోని పద్మశాలీయులు కుటుంబల తో సహా ప్రతి గడప నుండి భారీ సంఖ్యలు హాజరు కావాలని కోరారు. అన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పద్మశాలి సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు కాముని వనిత, అన్నదాస్ వేణు పాల్గొన్నారు.