ఆజాద్‌తో పలువురి నేతల భేటీ

హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల పర్యవేక్షకుడు గులాం నబీ ఆజాద్‌ను ఈ ఉదయం పలువురు నేతలు కలిశారు. లేక్‌వ్యూ అతిధిగృహంలో స్పీకర్‌ నాదెండ్ల, ఉపసభావతి మల్లుభట్టివిక్రమార్క, ఎంపీలు వివేక్‌, లగడపాటి తదితరులు ఆజాద్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిస్థితిని  నేతలు ఆయనకు వివరించినట్లు సమాచారం. అనంతరం క్యాంపు కకార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి. ఆజాద్‌, బొత్సలకు అల్పాహార విందు ఇచ్చారు.