ఆజ్మీర్ రుబాత్‌కు 26న కెసిఆర్ శంకుస్థాపన?
ఆదిలాబాద్,జూన్21(జనం సాక్షి): రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు ఈనెల 26వ తేదీన రాజస్థాన్‌లోని ఆజ్మీర్ వెళ్లనున్నట్లు సమాచారం. ప్రఖ్యాత అజ్మీర్ దర్గా వద్ద అక్కడి ప్రభుత్వం సమకూర్చిన ఐదు ఎకరాల్లో తెలంగాణ ప్రభుత్వం ముస్లింల కోసం విశ్రాంతి భవనం (రుబాత్)ను నిర్మించనుంది. ఈ నెల 26న ముఖ్యమంత్రి కేసీఆర్… విశ్రాంతి భవనానికి భూమి పూజ చేసేందుకు రాజస్థాన్ వెళ్ళనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మహ్మద్ అలీ నేతృత్వంలో ప్రతి జిల్లా నుంచి 25 మంది ముస్లింలను ఈ నెల 25న ప్రత్యేక రైలులో రాజస్థాన్‌కు తరలించనున్నారు. కాగా… ఉమ్మడి ఆదిలాబాద్‌జిల్లా నుంచి 100 మంది ముస్లింలు రాజస్తాన్ వెళుతున్నారు. అజ్మీర్ సొసైటీ ఉమ్మడి జిల్లా కన్వీనర్‌గా ఆదిలాబాద్‌కు చెందిన సిరాజ్ ఖాద్రీని నియమించారు.