ఆటలలో క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలి

స్నేహాభావంతో ఆటలు ఆడాలి
ఎడపల్లి ఎస్ఐ ఎండీ ఆసిఫ్
ఎడపల్లి, సెప్టెంబర్ 1 ( జనంసాక్షి ) : ఆటలలో క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని, ఆటలలో గెలుపోటములు సహజమేనని ఎడపల్లి ఎస్ఐ ఎండీ ఆసిఫ్ స్పష్టం చేశారు. శుక్రవారంనాడు ఎడపల్లి పంచాయతీ పరిధిలోని దుబ్బాతాండాలోని యంగ్ స్టార్ కీ.శే. నేనావత్ రాహుల్ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని  ఏర్పాటు చేసిన స్మారక కబడ్డీ పోటీలను ఎడపల్లి ఎస్ఐ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఎండీ ఆసిఫ్ మాట్లాడుతూ, యువకులు గ్రామీణ ప్రాంత క్రీడలపై మక్కువ పెంచుకోవాలని ఆయన అన్నారు. అయితే క్రీడా పోటీలలో గెలుపు ఓటములను క్రీడాస్పూర్తితో తీసుకొని ఆట యొక్క ఔన్నత్యాన్ని చాటాలని ఆయన అన్నారు. ప్రతీ ఆటగాడు స్నేహాభావంతో మెలుగుతూ ఆటలో పాల్గొనాలని ఆయన అన్నారు. క్రీడను అడ్డంపెట్టుకుని భేషజాలను ప్రదర్శించవద్దని ఆయన అన్నారు. ఆటలో గెలుపు, ఓటములు సహజమేనని, ఓటమి గెలుపుకు నాంది అనే విధంగా క్రీడాకారులు ఆటలో పాల్గొనాలని ఆయన స్పష్టం చేశారు. ప్రతీ ఒక్కరు ఆట నిబంధనలతో పాటు క్రీడ పట్ల అభిమానం చాటాలని ఆయన అన్నారు. కాగా యువకుడు నేనావత్ రాహుల్ స్మారకార్థం కబడ్డీ పోటీలను నిర్వహించడం అభినందనీయమని ఎస్ ఐ ఎండీ ఆసిఫ్ అన్నారు. ఈ మేరకు ఎస్ఐ ఎండీ ఆసిఫ్ క్రీడాకారులను పరిచయం చేసుకోవడంతో పాటు కూతకు సైతం వెళ్లారు. ఈ కార్యక్రమంలో యువకులు రవి, రాము, ఇతర యువకులు పాల్గొన్నారు.