ఆటోకన్నా విమనాయానమే చౌక

కేంద్రమంత్రి జయంత్‌ సిన్హా

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): మనదేశంలో ఆటోరిక్షాలో ప్రయాణం కంటే విమానయానమే చవక అని కేంద్ర పౌరవిమానయాన సహాయ మంత్రి జయంత్‌ సిన్హా అన్నారు. అయితే ఇందుకు ఆయన ఉదాహరణ కూడా చెప్పారు. జయంత్‌ సిన్హా సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో ప్రసంగిస్తూ.. విమానయానం చవకైనది అని ఉదాహరణతో చెప్పుకొచ్చారు. ‘ఈరోజుల్లో ఆటోరిక్షా కంటే విమాన టికెట్ల ధరలే తక్కువగా ఉన్నాయి. అదెలా సాధ్యమని విూరు అడగొచ్చు..? ఉదాహరణకు ఇద్దరు వ్యక్తులు ఆటోరిక్షాలో రెండు కిలోవిూటర్లు వెళితే రూ. 10 చెల్లిస్తారు. అంటే కిలోవిూటరుకు రూ. 5 చొప్పున ఇస్తున్నారు. అదే విమానంలో అయితే కిలోవిూటరుకు రూ. 4 చొప్పునే వసూలు చేస్తున్నాం’ అని సిన్హా చెప్పారు.జయంత్‌ సిన్హా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇది తొలిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగినఇండోర్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ 27వ ఇంటర్నేషనల్‌ మేనేజ్‌మెంట్‌ కాన్ఫరెన్స్‌లోనూ సిన్హా ఇదే లాజిక్‌ చెప్పారు. ‘ఈ రోజుల్లో ఇండోర్‌ నుంచి దిల్లీకి విమానమార్గం ద్వారా వెళ్లడానికి ప్రయాణికులుకిలోవిూటరుకు రూ. 5 చొప్పున చెల్లిస్తున్నారు. అదే ఆటోరిక్షా అయితే సిటీలో కిలోవిూటరు రూ. 8 నుంచి 10 చొప్పున ప్రయాణికుల నుంచి ఛార్జీలు వసూలు చేస్తున్నారు’ అని సిన్హా ఆ సదస్సులో చెప్పారుదేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని సిన్హా అన్నారు. నాలుగేళ్ల క్రితం 11కోట్ల మంది విమానాల్లో ప్రయాణించగా.. ఇప్పుడు ఆ సంఖ్య 20కోట్లకు పెరిగిందన్నారు. దీన్ని 100 కోట్లకు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.