ఆడబిడ్డలకు బతుకమ్మ చీరల పంపిణీ

కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
పెద్దవంగర సెప్టెంబర్ 24(జనం సాక్షి ) ఘనంగా బతుకమ్మలతో స్వాగతం పలికిన మహిళలు తెలంగాణలో ఏడాదికి ఒక్కసారి తీరక్క పూలతో పేర్చి దేవతల కొలిచే బతుకమ్మ పండుగను జరుపుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చీరలను సారేగా పంపిణీ చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.బతుకమ్మ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చీరలను శనివారం మండల కేంద్రంలోని సాయి గార్డెన్ లో ని బతుకమ్మ చీరల ను పంపిణీ మరియు కళ్యాణ్ లక్ష్మి చెక్కులు కార్యక్రమానికి స్థానిక ఎంపీపీ ఈదురు రాజేశ్వరి, సభకు అధ్యక్షత వహిస్తూ ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగాతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ నుంచి పుట్టిన బిడ్డ నుంచి ముసలితనం వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి కంటికి రెప్పలా కాపాడుకుంటుందని అన్నారు. బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని పేదింటి మధ్యతరగతి కుటుంబాల ఆడపడుచులకు పెద్దన్నగా బతుకమ్మ చీరల పంపిణీ ప్రతిఏడాది చేస్తున్నారని గుర్తు చేశారు తీరొక్క పూలతో పేర్చే కొలిచే బతుకమ్మ పండుగను ప్రపంచంలో గుర్తింపు పొందడం తెలంగాణ ఆడబిడ్డలకు అరుదైన గౌరవమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం 330 కోట్లు, పాలకుర్తి నియోజకవర్గం ఏడు కోట్లు అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్, జడ్పీటీసీ శ్రీరామ్ జ్యోతిర్మయి, పాలకుర్తి దేవస్థాన చైర్మన్ , రామచంద్ర శర్మ,డి ఆర్ డి ఓ సన్నాసయ్య, ఆర్డిఓ రమేష్, తహసీల్దార్ జి రమేష్ బాబు, ఎంపీడీఓ బి వేణు గోపాల్ రెడ్డి, ఏపీఎం నరేందర్ కుమార్, సర్పంచులు, వి,లక్ష్మి, భాస్కర్, గాజుల శోభ, దుంపల జమున,ఎంపీటీసీ లు ఎదునూరి శ్రీనివాస్, ఎర్ర సమిత,గాంధీ నాయక్,తెరాస మండల పార్టీ అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, టిఆర్ఎస్ మండల నాయకులు,గ్రామ నాయకులు, శ్రీరామ్ సుధీర్, సంజయ్,గ్రామ్ పార్టీ అధ్యక్షుడు,అంగడివాడి టీచర్లు,ఆశా వర్కర్లు,ఏఎన్ఎంలు, సిఏ లు, మహిళా మండల అధ్యక్షురాలు, మహిళలు, యూత్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు