ఆత్మకూరు నగేష్ జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు
మెగా జాబ్ మేళాకు అనుీయమైన స్పందన
ఆత్మకూరు నాగేష్ సేవలు అభినందనీయం
మెగా జాబ్ మేళా తో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు
నిరుద్యోగ యువతకు అండగా ఆత్మకూరు నాగేష్ ఫౌండేషన్
టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింతా ప్రభాకర్
సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి , జూలై 31 ::
ఆత్మకూరు నాగేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ మండల పరిధిలోగల మల్కాపూర్ గ్రామ శివారులోని గోకుల్ కన్వెన్షన్ హాల్లో సోమవారం నిరుద్యోగులకు అవకాశం ఇస్తూ మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు, టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింతా ప్రభాకర్, మరియు డి సి ఎం ఎస్ చైర్మన్ శివకుమార్లు జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం సాధించిన నిరుద్యోగి అపాయింట్మెంట్ లెటర్ ని వారు అందజేశారు.
ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ ఆత్మకూరు నాగేష్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఆయన సేవా కార్యక్రమాల ద్వారా పేద ప్రజల మనలను పొందుతున్నారన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ నిరుపేదలకు అన్ని విధాలుగా సహాయక సహకారం అందిస్తూ, నిరుపేద క్రీడాకారులకు ఆర్థిక ప్రచారాలు అందించడం, పేద విద్యార్థుల ఉన్నత చదువులకై చేయూతనియడం, వృద్ధులకు మరియు గర్భిణీ స్త్రీలకు దారిలో కూర్చోవడానికి సిమెంట్ బెంచ్ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే నిరుపేద ఆడపడుచుల వివాహానికి ఆర్థిక సహాయం అందించడం చేస్తున్నారని అభివర్ణించారు . సంగారెడ్డి మరియు సదాశివపేట క్యాంపు కార్యాలయాల్లో నిరుపేదలకు ఆన్లైన్ సేవలను అందించడం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అన్నారు.
అనంతరం ఆత్మకూరు నగేష్ మాట్లాడుతూ ఈ మెగా జాబ్ మేళాలో 100 కు పైగా కంపెనీలు తమ ఉద్యోగస్తుల ఎంపికకు వచ్చినారన్నారు. దాదాపుగా ఈ మెగా జాబ్ మేళాలో 2 వేలకు పైగా నిరుద్యోగులకు ఉద్యోగులు లభిస్తాయి అన్నారు. ఈ ఉద్యోగాలు వివిధ కంపెనీలు ఎలక్ట్రికల్, మెకానికల్, సాఫ్ట్వేర్ వివిధ కంపెనీల ద్వారా ఉద్యోగాలు ఉన్నాయన్నారు. పదవ తరగతి నుండి పీజీ వరకు చదివిన వారందరూ ఈ ఉద్యోగాలకు అర్హులు అన్నారు. రానున్న రోజుల్లో ఆత్మకూరు ఫౌండేషన్ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు విస్తరిస్తామని హామీని ఇచ్చారు. సంస్థ ద్వారా దాదాపు తొమ్మిది సంవత్సరాలకు పైగా నిరుపేదలను ఆదుకుంటున్నామని ఆయన వివరించారు. పర్యావరణ పరిరక్షణకు దాదాపు పదివేల జ్యూట్ బ్యాగులను పంపిణీ చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాల పంపిణీ ప్లేట్లు మరియు క్రీడా సామాగ్రి పంపిణీ చేయడంతోపాటు వారి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సహాయ పడటం జరుగుతుందన్నారు. అలాగే పోటీ పరీక్షల్లో పాల్గొనిరుద్యోగులకు పుస్తకాల పంపిణీ, నోట్లు అందజేయడం జరుగుతుందన్నారు.
ఆత్మకూరు నగేష్ జన్మదినం కావడంతో ముఖ్య అతిథుల మధ్య, యువత మధ్య జన్మదిన కేకును కట్ చేసి అందరికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అతిథులు, వీరశైవ లింగాయత్ సమాజ నాయకులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, అందరు కూడా ఆత్మకూరు నగేష్ ను శాలువాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ మఠంబిక్షపతి, ఆత్మకూరు అంజయ్య, బక్కప్ప, సి డి సి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ సి డి సి చైర్మన్ విజయేందర్ రెడ్డి, వీరశైవ లింగాయత్ నాయకులు మధు శేఖర్ ప్రసాది, సిద్దేశ్వర్, జగదీశ్వర్, నాయకులు, మల్ల గౌడ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
ఈ మెగా జాబ్ మేళాలో దాదాపు పదివేల మంది నిరుద్యోగులు నాయకులు పాల్గొన్నారు.