ఆత్మవిశ్వాసంతో చదవండి విజయం మీదే

  వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి బ్యూరో జులై  (జనం సాక్షి) ఆత్మవిశ్వాసంతో చదివితే విజయం మీ సొంతమవుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం సింగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్సై, కానిస్టేబుల్ ఉచితశిక్షణ తీసుకుంటున్న 400మంది అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లా ఇంచార్జ్ ఎస్పీ జె.రంజన్ రతన్ కుమార్ లు ఉచిత మెటిరీయల్స్(బుక్స్)ను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా శిక్షణ పొందిన అభ్యర్థులను ఉద్దేశించి మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఈ 60 రోజుల శిక్షణ పూర్తయిందంటే మీరు మొదటి ఎక్కినట్టే అని మీకు ఒక బలమైన సంకల్పం ఏర్పడిందన్నారు.కొంత మంది ఉద్యోగాలు సాధించి మిగతా వారు మిగిలినా ఎవరూ నిరాశ చెందవద్దని మీరు జీవితంలో స్థిరపడే వరకు మిమ్మల్ని వదలిపెట్టమన్నారు.ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రయివేటు కానీ ఇతర ఉద్యోగాలు సాధించేందుకు అన్ని సహకారాలు తాము అందిస్తామని భరోసా ఇచ్చారు.ఎవరైతే తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం చూడాలనుకుంటారో అదే పట్టుదల ఉన్నవారికి తాము అన్ని విధాల సహకరిస్తామని తెలిపారు మీరందరూ ఉద్యోగం సాధిస్తారనే నమ్మకం తమకు ఉందని ఆత్మవిశ్వాసంతో గురి చూసి కొడితే ఆకాశానికి కూడా రంధ్రం పడుతుందని కాబట్టి మీరందరూ ఆత్మవిశ్వాసంతో ఉండాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ, మహేందర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో చదివి సివిల్స్ సాధించారని అలాగే చాల పేదరికం నుండి ఉన్నత ఉద్యోగాలు సాధించారని అలాంటి వారిని మీరందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు . తాత్కాలిక ఆనందాలకు కొద్ది రోజులు దూరంగా ఉంటే శాశ్వతంగా సంతోషంగా ఉండే ఫలితాలు వస్తాయన్నారు. మీరు ఉద్యోగాలు సాధిస్తే అదే మాకు బహుమానం అన్నారు.ఎస్పీ రంజన్ రతన్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధతో పూర్తి ఏకాగ్రతతో చదివి అలాగే వాటిని ఎప్పటి కప్పుడు పఠనం(రివిజన్)చేస్తూ కష్టపడి చదివి ఏదో ఒక ప్రభుత్వ ఉదొగ్యం సాధించాలని తెలిపారు. ముఖ్యంగా అమ్మాయిలు మంచిగా చదువుకుని ఉద్యోగాలు సాదించి జీవితంలో నిలదొక్కుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఆర్ధికంగా ఎదగాలని అబ్బాయిలతో పోటిపడి చదవాలని తెలిపారు.అలాగే తల్లిదండ్రులు మిమ్మల్ని కష్టపడి చదివించారు కనుక ఈ ఉచిత శిక్షణ తరగతులను వినియోగించుకుని ఉద్యోగం సాధించి వారి ఆశయాలను నిలబెట్టి,వారి జీవితాలలో ఆనందం నింపాలని అభ్యర్ధులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో వనపర్తి అదనపుఎస్పీ షాకీర్ హుస్సేన్,వనపర్తి డీఎస్పీ ఆనంద్ రెడ్డి,సీఐ ప్రవీణ్ కుమార్,కొత్తకోట సీఐ శ్రీనివాస్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్,పి.జె.ఆర్.కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకుడు జగదీశ్వర్ రెడ్డి,వనపర్తి పట్టణ ఎస్సై యుగంధర్ రెడ్డి,రూరల్ ఎస్సై చంద్ర మోహన్,పోలీసు అధికారులు,సిబ్బంది ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.