ఆత్మీయ సన్మాన సభను విజయవంతం చేయండి.

భూపాలపల్లి టౌన్ జులై   (జనంసాక్షి)
 కూడా చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన సంగం రెడ్డి సుందర్ రాజు యాదవ్ కు ఉమ్మడి వరంగల్ జిల్లా అఖిలభారత యాదవ కుల బంధువుల ఆధ్వర్యంలో ఈనెల 31న ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జయశంకర్ జిల్లా ఆఖిల భారత యాదవ  మహాసభ అధ్యక్షుడు మేకల సంపత్ కుమార్ యాదవ్ తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటలకు హనుమకొండలోని కే ఎల్ ఎన్ గార్డెన్ చింతగట్టు భీమవరంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు దాస్యం వినయ్ భాస్కర్, గొర్ల పెంపకం దారుల సహకార రాష్ట్ర చైర్మన్ దూది మెట్ల బాలరాజు యాదవ్. ఎంపీ లు, ఎం ఎల్ సి లు,  చైర్మెన్స్, హాజరుకానున్నారని తెలిపారు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి యాదవ కుల బంధువులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరారు.