ఆదర్శ పాఠశాలలపై ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు
తిరుపతి,జూలై9(జనం సాక్షి): నిధులు లేవనే సాకులతో రాష్ట్ర సర్కారు ఆదర్శ పాఠశాలల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు అనంత చౌడప్ప ధ్వజమెత్తారు. ఉపాధ్యాయులకు కనీసం వేతనాలు చెల్లించకపోవడం దారుణమని చెప్పారు. ఉపాధ్యాయులకు 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలని, పదో పీఆర్‌సీ బకాయిలు విడుదల చేయాలని, ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు మంజూరు చేయాలని కోరారు. ఆదర్శ పాఠశాలల అభివృద్ధికి సత్వరం చర్యలు తీసుకోవడంతో పాటు పాఠశాలల్లో హిందీ ఉపాధ్యాయుల భర్తీకి చొరవ చూపాలని నినదించారు. ఆదర్శ పాఠశాలల అభివృద్ధికి నిధులు కేటాయించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆదర్శ పాఠశాలలు కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా ఏర్పాటైందని, తర్వాత ఆ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించినట్లు చెప్పారు.
————