ఆధునిక వ్యవసాయ పద్దతులు అవలంబించాలి
కడప,జూలై4(జనం సాక్షి ): నూతన వ్యవసాయ పద్ధతులను అవలంభించడం ద్వారా అధిక దిగుబడులనుపొందవచ్చని వ్యవసాయాధికారులు తెలిపారు. మండలాల వారీగా రైతులకు అవగాహనర కల్పిస్తున్నామని అన్నారు. రైతులకు ప్రభుత్వం అనేక సంక్షేమ ఫలాలు అందిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రైతులు తమ భూములలో భూసార పరీక్షలు నిర్వహించి సాగు చేయడం ద్వారా అధిక దిగుబడులు పొందవచ్చని పేర్కొన్నారు. పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించడం ద్వారా రైతులను చైతన్యం చేస్తున్నామని అన్నారు. రైతులు వారి భూసార పరీక్ష విశ్లేషణ పత్రముల సూచనల విధంగా ఎరువులు వాడాలని సూచించారు. వరి పంట నారు నాటు సమయంలో తీసుకోవాల్సిన మెళకువులను తెలియజేశారు.