*ఆధునీకరణ పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న పాలకులు

కరీంనగర్ పట్టణ సుందరికరణ పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం అన్నారు. ప్రజా సమస్యల అధ్యయన యాత్రలో భాగంగా బుదవారం తెలంగాణ చౌక్ వద్ద ఉన్న ఇందిరా చౌక్ పనులను సందర్శించారు.
ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి గుడికoదుల సత్యం మాట్లాడుతూ కరీంనగర్ పట్టణంలోని వివిధ నాయకుల విగ్రహాల చుట్టూ ఉన్న కూడళ్ళ ను ఒకసారి వెడల్పు చేస్తూ, మరోసారి తగ్గిస్తూ ఉన్నారని, ఇప్పటికే ఇందిరా చౌక్ కూడలిని మూడుసార్లు తవ్వారని,దీని మూలంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
పలుమార్లు తవ్వడo వెనుక ఆంతర్యం ఏoటని? ఇంజనీర్లకు సరైన ప్రణాళిక లేక నా? మున్సిపల్ పట్టణ అధికారులకు సరైన అవగాహన లేక నా ? లేదా కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసమా అని ప్రశ్నించారు.
ఇందిరా చౌక్ వద్ద తవ్విన ఎర్రమట్టిని కాంట్రాక్టర్ సుమారుగా 150 ట్రాక్టర్లు అక్రమంగా తరలించి ఒక ట్రాక్టర్ కు మూడు వేల రూపాయల చొప్పున అమ్ముకున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, దీనిపైన జిల్లా అధికారులు పూర్తిస్థాయి విచారణ జరిపించి రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.
అభివృద్ధికి సిపిఎం ఎప్పుడు ఆటంకం కాదని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తేనే ప్రశ్నిస్తామని అన్నారు ఇప్పటికైనా నిర్దిష్టమైన ప్రణాళికతో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా స్మార్ట్ సిటీ పనులు నిర్మించాలని అన్నారు.
అనంతరం అధ్యయన యాత్ర బస్టాండ్, కమాన్ చౌరస్తా,పోచమ్మ వాడ,కోతి రాంపూర్,కట్టరాంపూర్ లలో ప్రజా సమస్యలను తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు పి. మురళి,కొంపల్లి సాగర్,పున్నం రవి,జీ.తిరుపతి,నగర నాయకులు కోనేటి నాగమణి,ద్యావఅన్నపూర్ణ, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు