ఆధైర్య పడొద్దు అండగా ఉంటాం…

వరంగల్ ఈస్ట్, జులై 26 (జనం సాక్షి)గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనీ కాశీకుంట, డీకే నగర్, విద్యానగర్, పలు డివిజన్లు, ముంపుకు గురైనా లోతట్టు ప్రాంతాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్సీ “కొండా మురళీధర్ రావు”  మాట్లాడుతూ  వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ముంపుకు గురైనా ప్రాంతాలు జలమయమై ఇల్లలోకి నీరు చేరి ప్రజలంతా తీవ్ర  ఇబ్బందులకు గురవుతున్నారు  వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనీ పలు డివిజన్ లోని స్థానిక వీధిలోని ఇండ్లు మొత్తం జలమయమై ఇండ్లలోకి నీరు చేరి వారి నిత్యావసర వస్తువులతో పాటు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తడిచి ఆర్థిక నష్టం వాటిల్లినది కావున ఇవాళ ముంపునకు గురైన విషయం బాధితులను రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఆదుకోవాల్సిన అవసరం ఉన్నదని  అలాగే ముంపునకు గురైనా కుటుంబాలకు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు  నిత్యవసర సరుకులు కూరగాయలు, దుప్పట్లు పంపించడం జరిగింది. ముంపుకు గురైన గృహవాసుల ప్రజలు అయితేర్య పడద్దని అండగా ఉంటానని కొండా మురళీధర్ రావు అన్నారు కార్యక్రమంలో వరంగల్ కాంగ్రెస్ సిటీ మహిళా ప్రెసిడెంట్ నారగొని స్వప్న మురళి గౌడ్ ,నల్గొండ రమేష్ ,షేర్ల కిషోర్, ఎండి  అత్తర్ ,కత్తెరశాల వేణుగోపాల్, బత్తుల కుమార్, సింగర్ రాజు ,ఎండి అఫ్జల్, ఎండి సాజిద్, మీసాల ప్రకాష్, సంపత్, గిరిగిరి పుష్ప ,మంతెన సునీత మరియు కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

తాజావార్తలు