ఆధ్యాత్మికం

డబ్బు సంపాదనే ధ్యేయం కారాదు

ధనం మూలం ఇదం జగత్‌ అన్నారు. అయితే డబ్బు సంపాదన మానవుల్లో నైతికతను దెబ్బతీస్తోంది. పాపాభీతి లేకుండా పోతోంది. ఆధ్యాత్మికత లేకపోవడం కారణంగా మానవుల్లో పాపాలు పెరుగుఉతన్నాయి. ఈ రోజుల్లో మనుషులు ఎన్నో తప్పులు చేయడానికి ధనం ఒక కారణం. మరీ ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవనంలో మనుషులు పవిత్రంగా ఉండడానికి కూడా ధనం ఆటంకంగా మారిపోయింది. ధన సంపాదన అన్నది విసరీతాలు దారితీస్తోంది. నీ ప్రవృత్తికి కారణం అవుతోంది. అయితే డబ్బు సంపాదించవద్దని కాదు. అతిగా ఆలోచిచండం సరికాదని గుర్తించి సాగాలి. అత్యాశ కారణంగాప్రతి రంగంలో మనిషి యంత్రంలాగా వేగంగా పరుగెత్తుతున్నాడు. అపరిమితమైన ఆశతో అసలు సత్యాన్ని గుర్తించలేక జీవితం దుఃఖమయం చేసుకొంటున్నారు. ఈ అత్యాశ అనేది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా అంధకారంలో పడేస్తుంది. అత్యాశ ధనం విషయంలో మాత్రమే కాదు, దేని విషయంలోనైనా అంతే. రోగానికి ఔషధం, అజ్ఞానానికి జ్ఞానం ఎలా విరుగుడో.. అలా అత్యాశకు ఆత్మజ్ఞానమే ఉపాయం. జ్ఞాని అయిన వాడు లోకంలోని దుఃఖానికి కారణం అత్యాశ అని గ్రహిస్తాడు. మన పూర్వీకలు సూచనలు, పౌరాణిక గాథలు, పాపపుణ్యాలను ఆ గాథలకు లక్ష్యాలుగా నిర్ణయించి మనుషుల్లో ఆత్మజ్ఞనాం నింపే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. అవసరం మేరకు డబ్బు సంపాదించుకుని ఇహసుఖాలు అనుబవించడాన్‌ఇన ఎవరు కూడా తప్పుపట్టరు. నసంపాదనలో నిమగ్నమయినవారు దాని అభివృద్ధి, రక్షణ, వ్యయం, నాశనం, అనుభవం కలుగగానే, వరుసగా శ్రమ, భయం, విచారం, దుఃఖం సుఖభ్రాంతులను పొందుతారు – అని భాగవతం తెలిపింది. ఈనాటి ధనసంపాదనంతా సుఖంగా జీవించడం కోసం, తమ సంతానం రాబోవు రోజుల్లో ఆనందంగా జీవితం గడపడం కోసం అనుకొని తీవ్రంగా ప్రతివారు కష్టపడుతున్నారు. అందులోనే విలువైన జీవితం గడిచిపోయిమనకున్న అసలైన ఆధ్మాత్మిక లక్ష్యాన్ని ధ్వంసం చేస్తున్నది. ఇది గుర్తెరిగి ఉత్తమమైన మార్గాల్లో అర్థం సంపాదించాలి. అది మన జీవిత వినాశనాన్ని కోరుకునే విధంగా ఉండకుండా చూసుకోవాలి.

———————