ఆన్లైన్ మోసాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
ఏర్గట్ల జూలై (జనంసాక్షి ): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని,విద్యార్థులకు ఆన్లైన్ మోసాలపై ఎస్ఐ కోరేడే రాజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై రాజు మాట్లాడుతూ రోజు రోజుకు వివిధ రకాల యాప్ ల ద్వారా ఆన్లైన్లో సైబర్ నేరాలు పెరుగుతున్నందున విద్యార్థులు తగు జాగ్రత్త లు తీసుకోవాలని వీలైంత వరకు మొబైల్ ఫోన్ లకు దూరంగా ఉండాలన్నారు. అలాగే అత్యవసర సమయంలో 100 డయల్ ఎలా ఉపయోగించుకోవాలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జిజి గిరిధర్, పోలీస్ సిబ్బంది గంగాధర్, రాము పాల్గొన్నారు.