ఆన్లైన్ వస్తువులు కొనుగోలు విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
గరిడేపల్లి, అక్టోబర్ 18 (జనం సాక్షి): మండలంలోని కీతవారిగూడెం గ్రామానికి చెందిన మేళ్లచెరువు శ్రీనివాస్ కిరాణా షాప్ నిర్వహిస్తున్నాడు. కాగా గత 20 రోజుల క్రితం తన కూతురు కోసం మీ షోలో వెయ్యి రూపాయల విలువ గల వన్ గ్రామ్ గోల్డ్ చైన్ ని ఆర్డర్ పెట్టాడు. వారం రోజుల క్రితం డెలివరీ బాయ్ వచ్చి పార్సిల్ డెలివరీ ఇచ్చి 1000 రూపాయలు తీసుకొని వెళ్ళిపోయాడు. నేను మీ షోలో ఆర్డర్ పెడితే అమెజాన్ కవర్ వచ్చింది ఏందంటూ శ్రీనివాస్ ఆ పార్సెల్ విప్పి చూడగా అందులో చిరిగిపోయిన దస్తీలు సిసంగోలిల ప్యాకెట్ ఉంది. దీంతో వెంటనే డెలివరీ ఫోన్ చేయగా రిటర్న్ ఆర్డర్ పెట్టండి మా మేనేజర్ నెంబర్ ఇస్తాను మాట్లాడండి అంటూ ఉచిత సలహా ఇచ్చి తప్పుకున్నాడు. దీంతో డెలివరీ బాయ్ ఇచ్చిన నెంబర్ కు కాల్ చేయగా ఫోన్ స్విచాఫ్ వచ్చింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో మంగళవారం శ్రీనివాస్ పక్కింటికి పార్సిల్ తీసుకువచ్చిన డెలివరీ బాయ్ ని పట్టుకొని గట్టిగా నిలదీసి అతని వద్ద ఉన్న పార్సిల్ కవర్లను లాక్కొని ఆ డెలివరీ బాయ్ గట్టిగా నిలదీయడంతో 1000 రూపాయలు శ్రీనివాస్ కి ఇచ్చి అ పార్శిలు తీసుకొని వెళ్ళిపోయాడు.