ఆన్లైన్లో సినిమా టిక్కెట్లు
శ్రీకాకుళం, జూలై 22 : జిల్లాలో ఆన్లైన్ బుకింగ్ సినిమా టిక్కెట్లు అందుబాటులోకి వచ్చేశాయి. ఇటీవల పునఃప్రారంభమైన శ్రీకాకుళం పట్ణంలోని రామలక్ష్మణ థియేటర్లో ఆన్లైన్ సినియా టిక్కెట్లను అందుబాటులోకి తెచ్చింది. టిక్కెట్లను డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.టిఐసికెఇటిఎస్ డిఎడిఎ.కం ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. తమ థియేటర్లో ఆన్లైన్ ద్వారా టిక్కెట్ బుక్ చేసుకొని సినిమా చూసే ప్రేకిక్షులకు ఈ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చామని సంబంధిత థియేటర్ ఇన్‌ఛార్జి విజయభాస్కర్ చెప్పారు. థియేటర్‌కు సంబంధించిన టిక్కెట్ల ధరలను రూ. 10, 30, 40లుగా నిర్ణయించామన్నారు. జిల్లాలో తొలిసారిగా:- జిల్లాలో తొలిసారిగా ప్రేక్షుకులకు అత్యంత ఆధునికమైన సౌకర్యాలతో అన్ని హంగులతో ఈ థియేటర్ రూపుదిద్దుకుంది. క్యూలైన్లలోనిల్చొని టిక్కెట్ల కోసం ఎగబడే శ్రమ లేకుండా ప్రేక్షకులు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకొని హాయిగా థియేటర్లో సినిమా చైసే సౌకర్యాన్ని యాజమాన్యం కల్పించడం విశేషం. ఇటువంటి సౌకర్యం జిల్లాలో ఇదే ప్రథమం.