ఆపదలో ఉన్నవారికి ఆపద్భాందవుడు.. – కాంగ్రెస్ సీనియర్ నాయకులు.


ఊరుకొండ, డిసెంబర్ 7 (జనంసాక్షి):
ఆపదలో ఉన్నవారికి ఆపద్భాందవుడు మాధారం సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ద్యాప నిఖిల్ రెడ్డి అనీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అన్నారు. బుధవారం
ఊర్కొండ మండలంలోని మాధారం గ్రామానికి చెందిన అంకురి ఇస్తారి(45) అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందారు. ఈ విషయాన్ని స్థానిక సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ద్యాప నిఖిల్ రెడ్డి తెలిసిన వెంటనే బాధిత కుటుంబానికి అండగా ఉంటానని, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. 5వేల ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, డీఎన్ఆర్ యువసేన సభ్యులు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలను ఆదుకుంటున్న ద్యాప నిఖిల్ రెడ్డి గారికి గ్రామస్తులు ఎల్లవేళలా అండగా ఉంటారని, మాకు ఇలాంటి నాయకుడు ఉండటం గ్రామ ప్రజలకు అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఎవరికి ఏ ఆపద వచ్చిన ముందుకు వచ్చి నేనున్నానంటూ ఆదుకుంటున్న మనసున్న మహారాజుకు ప్రజల దీవెనలు ఉండాలని కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, డీఎన్ఆర్ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.