ఆఫ్ఘన్‌లో రోడ్డు ప్రమాదం
– 73 మంది మృతి
కాబూల్,మే8(జనంసాక్షి):అఫ్ఘనిస్తాన్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాబూల్-కాందహార్ ప్రధాన రహదారి పై రెండు బస్సులు, ఓ ఆయిల్ ట్యాంకర్‌లు
ఢీకొన్నాయి. సెంట్రల్ ప్రావిన్స్ ఆఫ్ గజనీలోని మోకార్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 73 మందికి పైగా మృతిచెందారు.ఆయిల్ ట్యాంకర్ పేలడంతో రెండు
బస్సులకు మంటలు అంటుకున్నట్టు తెలుస్తోంది. సహాయక చర్యల్లో పాల్గొనడానికి ఆర్మీ రంగంలోకి దిగింది. క్షతగాత్రులను అసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింతపెరిగే అవకాశం ఉందని సమాచారం.