ఆమ్లా అదుర్స్ ‘డబుల్’ మిస్ ఎదురీదుతున్నఆసీస్
పెర్త్, డిసెంబర్2: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య పెర్త్‌లో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో మూడో నెంబర్ బ్యాట్స్‌మెన్ హషీమ్ ఆమ్లా అదుర్స్ అనిపించాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా వికెట్లేమీ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. కోవాన్, వార్నర్ ఆడుతున్నారు. అంతకుముందు బ్యాటింగ్ చేసి దక్షిణాఫ్రికా జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 569 పరుగులు చేసింది.
అస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 163 చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో 40 పరుగులతో ఆడుతోంది. దాదాపు ఆస్ట్రేలియా ఓటమి చెందినట్లే భావించవచ్చు. మూడో రోజు హషీమ్ ఆమ్లా నాలుగు పరుగుల దూరంలో డబుల్ సెంచరీ మిస్సయ్యాడు. 196 పరుగులు చేశాడు. డివిల్లీయర్స్ కూడా 169 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో 31 పరుగులు చేస్తే ఇతను కూడా డబుల్ చేసేవాడు. కాగా 2012లో మూడో బ్యాట్స్‌మెన్‌గా దిగి1000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు పూర్తి చేసుకున్నా ఆటగాళ్లలో ఆమ్లా మూడవాడు. ఇతనికంటే ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ 1314 (పెర్త్ మొదటి టెస్టులోని పరుగులతో), ఇంగ్లాండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ 1044(13 టెస్టులలో )లతో ఉన్నారు. 196 పరుగుల వద్ద అవుటైన ఆమ్లా ఈ సంవత్స రం 1064 పరుగులు చేశాడు.