ఆయుర్వేదం భారతీయ ప్రాచీన సాంప్రదాయ వైద్యం
-కలెక్టర్ రవిందర్‌రెడ్డి
నిజామాబాద్,అక్టోబర్12(జనంసాక్షి): గతంలో ఎంతోప్రాచుర్యం పోందిన ఆయుర్వేద వైద్యం తిరిగి మంచి రోజులు వస్తున్నాయని, దీనికి ఉదాహరణ ప్రజలనుంచి వస్తున్న ఆదరణెళి ముఖ్యమని నిజామాబాద్ జిల్లా ఇంచార్జి కలెక్టర్ రవిందర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ధన్వంతరి జయంతి సందర్బంగా జాతీయ
ఆయుర్వేద దినోత్సవంను ఆయుశ్ శాఖ ఘనంగా నిర్వహించింది. ఈసందర్బంగా కలెక్టరేట్ మైదానం నుంచి భారీ ర్యాలీనీ కలెక్టర్ జండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ ఆయుర్వేద దినాన్ని నిర్వహించి ప్రజల్లో తిరిగి నమ్మకా న్ని పెంచడమే లక్ష్యంగా చేస్తున్నామన్నారు. సంపూర్ణ ఆరోగ్యం ఆయుర్వేదంతో సాద్యమని ప్రకృతి ఇచ్చిన వైద్యం ఆయుర్వేదమని ప్రాచీన ఆయుర్వేద విజ్ఞానాన్ని మరింత ప్రజలకు అందించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈసందర్బంగా ఉచితంగా వైద్య శిభిరాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈర్యాలీ కలెక్టరేట్‌నుంచి తిలక్‌గార్డెన్ ప్రభుత్వ ఆసుపత్రివరకు జరిగింది. ఇందులోనలందహైస్కూల్ శాంతినికేతన్ కాకతీయకళాశాలల విద్యార్థులుపాల్గొన్నారు.కార్యక్రమంలో ఇంచార్జిడీఆర్‌ఓ వినోద్‌కుమార్, జిల్లా వైద్యాధికారి రామచందర్, రమణమోహన్, గంగాదాస్, జ్యోత్స్న, మమత, రాధిక ప్రేమలత తదితరులు పాల్గొన్నారు.