ఆయుష్మాన్ భారత్ ఉత్తమ సేవా రాష్ట్ర స్థాయి పురస్కారం అందుకోవడం అభినందనీయం.

 జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 22(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జర్నల్ ఆసుపత్రిలో ఆరోగ్య మిత్రగా విధులు నిర్వహిస్తున్న వేముల కురుమయ్యను ఆయుష్మాన్ భారత్ ఉత్తమ సేవా రాష్ట్ర స్థాయి పురస్కారం అందుకోవడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అన్నారు.
శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయ సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో జిల్లా కలెక్టర్ రాష్ట్ర స్థాయి పురస్కారం, ప్రశంసా పత్రాన్ని వేముల కుర్మయ్యకు అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కురుమయ్య చేస్తున్న సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని అందజేయడం జరిగిందని,ఇదే న్ఫూర్తితో జిల్లావ్యాప్తంగా ప్రజలకు ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ సేవలు విస్తృతంగా అందేలా కృషి చేసి,సేవలు అందించాలని కలెక్టర్ కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రి డి సి హెచ్యస్ డాక్టర్ రమేష్ చంద్ర, జర్నల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘు, ఆరోగ్యశ్రీ  టీం టీడర్లు కే. జానకి రాములు, ఎస్. శ్రీనివాసులు, ఆరోగ్య మిత్రాలు డి. బంగారయ్య, కె పరుశురాములు, మహేష్, పారిజాత, సుజాత తదితరులు పాల్గొన్నారు.