ఆయుష్మాన్ భారత్ డిజిటల్ ఐడి కార్డుల నమోదులో అలసత్వం ప్రదర్శించొద్దుజిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా కె సుధాకర్ లాల్

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి అక్టోబర్13( జనం సాక్షి) నాగర్కర్నూల్ లో పల్లే దవాఖాన వైద్యులకు (ఎమ్. ఎల్ . ఎచ్.పి.) జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నందు నేడు ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా.కె సుధాకర్ లాల్ మాట్లాడుతూపల్లే దవాఖాన పరిధిలోని ఆయుష్మాన్ భారత్ డిజిటల్ ఐడికార్డులనమోదులో మరింత వేగవంతం చేయాలని, ప్రతి పౌరుడికి డిజిటల్ ఐడి క్రియేట్ చేయలని వైద్య సేవల నాణ్యత విషయంలో రాజీ పడోద్దని అన్ని రకాల వైద్య సేవలు డిజిటల్ రూపంలో నమోదు అవ్వడం ద్వారా నాణ్యమైన వైద్య సేవలు పౌరులకు అందించడం జరుగుతుందని అన్నారు.
పల్లే దవాఖాన పరిధిలోని గర్భిణీల సమాచారాన్ని ఎప్పటికప్పుడు కె.సి.అర్. కిట్ లో నమోదు చేయలని మరియు దీర్ఘకాలిక రోగులకు అందించేసేవలనుఎప్పటికపుడు ఎన్.సి.డి. వెబ్ సైట్ లో నమోదు చేయలని విధుల నిర్వహణలో ఏ విధమైన అలసత్వం ప్రదర్శించిన శాఖ పరమైన చర్యలుతప్పవన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్మునైజేషన్ అధికారి డా. రవి కుమార్ , ప్రోగ్రామ్ అధికారులుడా.ప్రదీప్,రెనాయ్యా,డా.శివ, ఎపిడమాలజిస్ట్ డా. ప్రవలిక, సి.ఎచ్.ఓ. అశోక్ప్రసాద్, సందీప్ వైద్య అధికారులు పాల్గొన్నారు.