ఆరిపోని విప్లవ జ్యోతి కారల్‌మార్క్స్
కారల్ మార్క్స్ 1818 మే అయిదవ తేదీన జర్మనీలోని పుయర్ నగరంలో జన్మించారు. తల్లి హెన్రెట్టా, తండ్రి హెన్రిచ్ మార్క్స్ దంపతులకు తొమ్మిదిమంది సంతానంలో మూడవవాడు. మార్క్స్ ప్రపంచాన్ని పరిపరి విధాల నిర్వచించాడు. కావలసింది మార్చడం అంటూ పిలుపునిచ్చిన ప్రపంచ మేధావి మార్క్సిస్టు గొప్ప సిద్దాంత కర్త కారల్ మార్క్స్ ప్రపంచాన్నే మార్చివేసే సిద్దాంతాల్ని రూపొందించి ప్రపంచ కార్మికులారా! ఏకంకండి అని మార్క్స్ ఎంగెల్స్‌లు ఇచ్చిన నినాదం ప్రపంచమంతటా ప్రతిధ్వనించింది. మనిషిని మనిషి దోచుకునే సమాజానికి సమాధి కట్టింది మార్క్సి జం. పీడిత భాదిత జనానికి శ్రామికవర్గానికి విముక్తి కల్పించిది. సామ్రాజ్యవాద దోపిడి ప్రపంచీకరణ సరళీకరణ ప్రయివేటీకరణ తాకిడికి ప్రతిఘటన పెరుగుతున్న కొద్ది కారల్‌మార్క్ప్ రచించిన గ్రంథాలు రికార్డు స్థాయిలో అమ్మకాలు జరుగుతున్నాయి. కారల్ మార్క్స్ జెన్నీ మార్క్స్ కుటుంబం జీవితాంతం అంటే తుది శ్వాస విడిచేంత వరకు కష్టనష్టాలను ఇదుర్కొంటూనే కార్మికోద్యమాలను మరింత ముందుకు నడిపారు. నిస్వార్ధం, త్యాగాలు వారికి సొంతం విప్లవాలను ప్రపంచ దేశాలలో విజయవంతం చేయడానికి కారల్‌మార్క్స్ శ్రమ పట్టుదల ఎంతో విలువైనది. ఎంగెల్స్ ఆర్థిక సహాయం మార్క్స్ కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చింది. మార్క్సిస్టు విప్లవ జీవితం ప్రపంచ ప్రజలకు మార్గదర్శకంగా నిలుస్తుంది. మార్క్స్ పట్టుదలగా ఉన్నత చదువులను అభ్యసించా డు. సాహిత్యం, సంస్కృతి, కళలు చరిత్ర అంటు ఆయనకు ఎంతో ఇష్టం. మార్క్స్ తండ్రి న్యాయవాది దుర్బర జీవితాన్ని అనుభవి ంచాడు. పేదరికాన్ని జయించాడు. ప్రయార్‌లో మార్క్స్ పాఠశాలకు వెళ్లే దారిలో, మురికి వాడల్లో పేద రైతాంగం ఆకలి చావుల్ని కళ్లారా చూశాడు. అట్టి దారిద్య్రన్ని చూసి మార్క్స్ చలించి పోయా డు. జెన్నీఫర్ వెస్ట్ ఫాలెన్ ప్రయర్ ప్రాంతానికే అందగత్తె ఆమె ప్రేమ కోసం ఎందరో సంపన్న కుటుంబాలు యువకులు ఎదురు చూస్తుండేవారు. అపురూప సంబంధాలన్నింటిని కాలదన్ని జెన్నిఫర్ నాలుగేళ్లు చిన్న వాడు,సామాన్య కుటుంబం లాయర్ కుమారుడైన కారల్ మార్క్స్‌ని ప్రెమించింది. 1836 అక్టోబర్ 22న మార్క్స్ న్యాయశాస్త్ర విభాగంలో ప్రవేశించాడు. క్రిమినల్ చట్టం రోమన్ న్యాయశాస్త్రం మానవ సమాజ శాస్త్రం అనే విద్యలను పగలనక రేయనక కష్టపడి చదివాడు. 18 ఏళ్ల చిన్న వయసులోనే కవితలు, వ్యాసాలు రాయడం మొదలు పట్టాడు. జెన్నిని వదిలిపెట్ట దూరంగా వుండవలసి రావడం ఆయనకెంతో బాధించింది. జెన్నీ వెస్ట్ ఫాలన్‌కు అంటూ మూడు నోట్ పుస్తకాలను కవితలు అల్లి నింపేశాడు. 1842లో పత్రికలకు కవితలు, వ్యాసాలు రాయసా గాడు. అవి ఎడిటర్‌లను ఎంతో ప్రభావితం చేశాయి. కొద్దికాలనికే పత్రిక అధినేత మార్క్స్‌ను ఎడిటర్‌గా నియమించాడు. లేత వయస్సులోనే ఆయన జర్మనీ దేశ బూర్జువా వర్గ ప్రధాన పత్రికలో ప్రథమ వ్యక్తి అయ్యాడు. మార్క్స్ వ్యక్తిగత జీవితంలోనూ, ఆపత్రిక అభివృద్దిలోనూ నూతన దశ ప్రారంభమైంది. పెట్టుబడిదారీ దౌర్జన్యాలు, మోసాలపై నిప్పులు చెరిగారు. దోపిడీ, పీడనలకు చోటులేని నూతన వ్యవస్థ కోసం మార్క్స్ కళలలు కన్నాడు. ఆదర్శ మానవ సమాజ నిర్మాణం కోసం మార్క్స్‌సూచించినటువంటి దారులు కొనసాగుతున్నాయి. దారిద్య్రంలో మగ్గిపోతున్న రైతుల బతుకులను చూసి మార్క్స్ చలించిపోయాడు. రాజకీయ హక్కులు లేని సామాన్య రైతాంగంపై భూస్వామ్యాలు సాగిస్తునటువంటి దర్మార్గాలను అయన ఖండించారు. నిరుపేతలకు రాజాంగ వ్యవస్థ లో తగిన స్థానం లేదని విమర్శలు గుప్పించాడు. కంరిజెంకీలో 1843 జూన్ 18న కారల్‌మార్క్స్ , జెన్నీలు ప్రేమ వివాహం చేసుకున్నారు. 1844 మే 1న తొలి కాన్పుగా పాప పుట్టింది. ఆ పసి పాపకు జెన్నీ పేరు నామకరణం చేశారు. అటు తరువాత ఒకపాప ముద్దుల కొడుకు జన్మించాడు. వైద్యం అందక ఎడ్గార్ ముషి మృతి చెందాడు. దీంతో మార్క్స్ కుంగిపోయాడు. మార్క్స్ కుటుంబం పేదరికాన్ని జయించింది. మార్క్స్ కుటుంబానికి కార్మికుల పట్ల ప్రేమ ఆప్యాయయత, గౌరవం ఉండేది. శ్రామిక ప్రజల పక్షాన నిలిచి ఎన్నో పోరాటాలు చేశారు. కమ్యూనిజం ఆలోచనపరుడయిన ఎంగెల్స్ మార్క్ప్‌ల మధ్య స్నేహం పెరిగింది. 1845లో ఫ్రెంచి అధికారులు మార్క్స్‌ని బహిష్కరించారు. 24గంట ల పాటు పారిస్ వదిలి వెళ్లిపోవాలని అయనకు తాఖీదులు వచ్చా యి. జర్మనీకి వెళ్లడానికి అవకాశం లేక ప్రస్యా సరిహద్దుల్లో అయ నపై అరెస్టు వారంటుంది. దీంతో ఆయన బెల్జియం వలస వెళ్లాడు. మార్క్స్ ఎంగెల్స్‌లు రూపొందించిన గతితార్కిక చరిత్రక భౌతికవా దం ప్రపంచాన్ని ఆదర్శవాదుల, పదార్ధం ద్వారానే, పదార్థాన్ని వివరిస్తుంది. మానవ సమాజం అభివృద్ది కూడా భౌతిక శుక్తులపై పెరుగుదతల ఆధారపడి వుంటుంది. మార్క్సిజానికి బద్ద శత్రువులైన కొదరు మార్క్స్ గ్రంధాలను వ్యతిరేకించారు. మార్క్స్ ఎంగెల్స్‌లు నిజమయిన సోషలిస్టులు 1866లో మొదటి అంతర్జాతీయ కార్మిక సంఘం సమావేశం కారల్‌మార్క్స్ నాయవత్వంలో జెనివాలో జరిగింది. 8 గంటల పనిదినాలు కోసం డిమాండ్‌ను ప్రపంచ కార్మికుల డిమాండ్‌గా మార్చివేసింది. మార్క్స్ ఎంగెల్స్‌లు శాస్త్రీయ సోషలిజాన్ని రూపొందించారు. మార్క్స్ సిద్దాంత మార్గదర్శి నేతృత్వంలో 1817లో రష్యాలో లెనిన్ నాయవత్వంలో సోషలిస్టు విప్లవం విజయవంతమయింది. చైనా, తూర్పుయూరప్‌లో, ఉత్తరకొరియా, క్యూబా, వెనిజూల వంటి ప్రపంచ దేశాల్లో సోషలిస్టు విప్లవాలు విజయవంతం అయ్యాయి. మార్క్స్ సూచించిన సిద్దాంతం ప్రకారం ఆయా ప్రపంచ దేశాలతో కమ్యూనిస్టు పార్టీలు ఏర్పడినాయి. కార్మిక వర్గ సిద్దాంతమయిన శాస్త్రీయ సోషిలిస్టు సిద్దాంతం కారల్ మార్క్స్, ఎంగెల్స్‌లు రూపొందించడానికి దారి తీశాయి. పెట్టుబడి దారీ విధానానికి అంతం పలికి సోషలిజాన్ని సాధించే సామాజిక శక్తి కార్మిక వర్గం మాత్రమేనని మార్క్స్‌ని ఎంగెల్స్‌లు చెప్పారు. కార్మికవర్గం రాజ్యాధికారం సాధించిన పారిస్ కమ్యూన్ పోరాటానికి మార్గం వేశాయి. శ్రామికవర్గం విముక్తి కోసం మార్క్స్ నిరంతరం పరితపించాడు. 1883 మార్చి 17న మార్క్స్ భౌతికకాయం ఖననం చేయబడింది. అట్టహాసంగా అంత్యక్రియలు జరగడం ఇష్టంలేని మార్క్స్ అంత్యక్రియలలో డజన్‌మంది హాజరయ్యారు. మార్క్స్ మరణానికి వివిథ దేశాల నుండి అభ్యుదయ వాదులు సంతాప సందేశాలు పంపారు. మార్క్సిజానికి మరణం లేదు, మార్క్స్ సిద్దాం తాలకు కాలం చెల్లిందని సంబరపడిన వారు కొద్దికాలానికే నాలుక కరుచుకున్నారు. మూర్క్స్ విప్లవ యోధుడు, మహన్నతుడు, అయనపేరు తరతరాలుగా శాశ్వతంగా వెలుగొందుతుంది. పెట్టుబ డిదారి దోపిడీ, సామ్రాజ్యవాధులకు సమాదానం మార్క్సిజం.
– దావరపల్లి నర్సింహరెడ్డి