ఆరేపల్లి పాఠశాలకు స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ అవార్డు అందజేత

మండలం ఆరేపల్లి  ప్రాథమికోన్నత పాఠశాలకు 2021 – 2022 కు సంబంధించి స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ అవార్డును జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అందజేయడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి. విజయలక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆరేపల్లి ప్రాథమికోన్నత  పాఠశాలను జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిల్లో కూడా 6 క్యాటగిరీలలో 59  అంశాల్లో పోటీ పడడం అభినందనీయమని అన్నారు. కార్పొరేట్ స్కూల్ కు దీటుగా ఆరేపల్లి ప్రాథమికోన్నత పాఠశాల ను దత్తత తీసుకొని అతి తక్కువ సమయంలో ఇంతలా అభివృద్ధి పరిచిన విద్యా కమిటీ చైర్మన్ అంకం శ్యామ్ రావు ను మరియు ఉపాధ్యాయ బృందాన్ని అభినందిస్తున్నానని మునుముందు ఈ అభివృద్ధిని కొనసాగించాలని అన్ని పాఠశాలలకు ఆదర్శంగా నిలవాలని  అన్నారు. అనంతరం స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ అవార్డును వారి చేతుల మీదుగా అందించి అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి  పాటిల్ మరియు డిఇఓ రాజు, సెక్టోరియల్ అధికారులు శ్రీపతి, వేణు, గంగా కిషన్, ఎగ్జామ్ కన్వీనర్ లింగం, స్వచ్ఛ విద్యాలయ పురస్కార్ కమిటీ సభ్యులు, జిల్లాలోని ఎంఈఓ లు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు మరియు వారి పాఠశాల విద్యా కమిటీ చైర్మన్లు ,సీఆర్పీలు, తదితరులు పాల్గొన్నారు