ఆరో వార్డు లో కిరణ్ ఎంక్లేవ్ మరియు మారుతి నగర్ అభివృద్ధి పనులు ప్రారంభించిన జె. రామకృష్ణ

 *పాల్గొన్న మాజీ బోర్డు ఉపాధ్యక్షురాలు బానుక నర్మదా మల్లికార్జున్*
 *ప్రజ సమస్యలకు పరిష్కారం చూపుతున్న రామకృష్ణ*
కంటోన్మెంట్ అక్టోబర్ 23 జనం సాక్షి కంటోన్మెంట్ లోని ఆరో వ వార్డు కిరణ్ ఎంక్లేవ్ లో రూ. 10లక్షల తోఅండర్ గ్రౌండ్ డ్రైనేజీ అభివృద్ధి పనులను ప్రారంభించిన కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సివిలియన్ సభ్యుడు జె. రామకృష్ణ, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు భానుక నర్మదా మల్లికార్జున్ , మరియు బాణాల శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మేట్ ది ప్రోగ్రాంలో కాలనీ వాసులు వారి యొక్క ముఖ్య సమస్యలు ప్రస్తావించారు, త్రాగు నీటి పైప్ లైన్ లో వాటరలోప్రెజర్ గురించి, స్ట్రీట్ లైట్లు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని కోరారు మరియు పార్కులు డెవలప్మెంట్ గురించి జె. రామకృష్ణ, బానుక మల్లి కార్జున్ తో కాలనీ వాసులు చర్చిండం జరగింది,ఏదైతే ఫ్రీ వాటర్ ఇస్తున్నారో దాని వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంది అన్ని అన్నారు గతంలో చూస్కుంటే రెండు రోజుల కి ఒక్కసారి నీరు వచ్చేవి, ఇపుడు నాలుగు రోజుల కి ఒక్కసారి వస్తుంది అన్ని వారు వాపోయారు, దీనికి గాను మేము కూడా కంటోన్మెంట్ బోర్డ్ మెట్రో వాటర్ వర్క్స్ నుంచి రావలసిన వాటర్ 110 గాలెన్స్ మనకు రావలసిన వాటా నీళ్లు ఇప్పుడు మనకి 80 గాలెన్స్ మాత్రమే వాటర్ వస్తుందని రామకృష్ణ కాలనీ ప్రతినిధులకు చెప్పారు ,కానీ మాకు పూర్తి స్థాయి లో నీటి సరఫరా చేయాలని వారు కోరారు వాటికి త్వరలో పరిష్కరిస్తానన్ని చెప్పారు,ఈ కార్యక్రమం లో కిరణ్ ఎన్క్లేవ్ సొసైటీ ప్రతినిధులు సైదా రెడ్డి, అనిత, నర్మదా, నరహరి, తుంబీ, త్యాగి, మధు త్యాగి, వెంకట్రావు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అనంతరం కంటోన్మెంట్ ఆరో వార్డు మారుతి నగర్ లో రూ.10 లక్షల తో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మారుతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వేణు గోపాల్ రెడ్డి,బాల్ తేశ్వర్, బాల్ రాజ్, సంజీవరెడ్డి, విద్యాసాగర్, రమేష్, రఘుగోత్తమరెడ్డి, రమేష్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి తదితరులు మరియు స్థానిక నాయకులు పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు.అనంతరం రాంగోపాల్ ఎంక్లేవ్ ఏర్పాటుచేసిన మేట్ మై మెంబర్స్ సమావేశంలో పాల్గొన్ని కాలనీవాసుల సమస్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు తమ కాలనీలో వాటర్ సమస్య చాలా ఎక్కువగా ఉందని అన్నారు, అలాగే ప్లాట్ నెంబర్ 41 లో కట్టడాలను ఆపాలని ఆ ప్లాట్ లో పార్కును ఏర్పాటు చేయవలసిందిగా కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు దీనికి రామకృష్ణ సానుకూలంగా స్పందించారు రాబోయే రోజుల్లో మీరు అడిగిన అన్ని సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చారు.

తాజావార్తలు