ఆర్ఎంపీలు వారి పరిధికి మించి చికిత్స చేస్తే చర్యలు తప్పవు

  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవిశంకర్
వనపర్తి జులై 26 (జనం సాక్షి) ఆర్ఎంపీలు వారి పరిధి కి మించి చికిత్సలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవి శంకర్ హెచ్చరించారు.వనపర్తి జిల్లాలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రథమ చికిత్స కేద్రం, ఫైల్స్ క్లినిక్ ను గతవారం వారిపై వచ్చిన ఆరోపణల మూలంగా వారి యొక్క కేంద్రాలు వారిచే తాళం వేయించి తాత్కాలికముగా మూసివేయడం జరిగిందన్నారు ఈ విషయమై ప్రధమ చికిత్స కేంద్రం,ఫైల్స్ క్లినిక్ నిర్వాహకులు వ్యక్తిగతంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నందు సంప్రదించి వారు వారి పరిధికి మించి ఎలాంటి చికిత్సలు చేయలేదని తెలుపగా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఆ సెంటర్లపై ఫిర్యాదు చేసిన వ్యక్తిని సంప్రదించి విచారణ జరపగా తప్పుడు సమాచారం అని తేలిందని తెలిపారు.అనంతరం ఆర్.ఎం.పి, పీ.ఎం.పీలను మందలించి రాతపూర్వకంగా అఫిడవిట్ లో కేవలం ప్రధమ చికిత్స మాత్రమే చేస్తామని ఫైల్స్ క్లినిక్ లో కేవలం ఆయుర్వేద చికిత్స మాత్రమే చేస్తామని రాయించుకొని వారి కేంద్రాలను తెలుసుకోవాలని వారు తెలిపారు.