ఆర్చిబిషప్‌ లేఖను చూడలేదు: రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ,మే22(జ‌నం సాక్షి):  దేశంలోని మైనారిటీలందరూ క్షేమంగా ఉన్నారని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. మైనారిటీలు సురక్షితంగా ఉన్న దేశాల్లో భారత్‌ కూడా ఒకటనీ…కులం, మతం పేరిట వివక్ష చూపించేందుకు ఎవర్నీ అనుమతించబోమని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలోని చర్చిలన్నిటికీ ఆర్చిబిషప్‌ అనిల్‌ జోసెఫ్‌ కౌంటో లేఖ రాయడం సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో  సెక్యులర్‌ ప్రభుత్వం ఏర్పడేలా సంవత్సరం పొడవునా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించా లంటూ ఆయన తన లేఖలో కోరారు. ఈ నేపథ్యంలో విూడియా అడిగిన ఓ ప్రశ్నకు రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందిస్తూ… ‘నేను ఆ లేఖ చూడలేదు. అయితే మైనారిటీలు సురక్షితంగా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. కులం, మతం ఆధారంగా వివక్ష చూపించే ఎవరికీ ఇక్కడ తావులేదు..’ అని పేర్కొన్నారు.