ఆర్టీఐ పరిధిలోకి రాజకీయ పార్టీలు

న్యూఢల్లీి, జూన్‌ 2 (జనంసాక్షి) :
దేశంలోని గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకువస్తూ కేంద్ర సమాచార కమిషన్‌ నిర్ణయం తీసుకుంది. సోమవారం సెంట్రల్‌ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌ సత్యానంద మిశ్రా, ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌ ఎంఎల్‌ శర్మ, అన్నపూర్ణ దీక్షిత్‌ నేతృత్వంలో నిర్వహించిన ఫుల్‌ బెంచ్‌ విచారణకు కాంగ్రెస్‌(ఐ), బీజేపీ, సీపీఎం (ఎం), సీపీఐ, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ పాల్గొన్నాయి. రాజకీయ పార్టీల వ్యవహారాలు పారదర్శకంగా ఉండేందుకు ఈ చట్టం ఎంతగానో ఉపకరిస్తుందని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీల అధ్యక్ష, కార్యదర్వులు తమ పార్టీ వ్యవహారాలపై జవాబుదారీగా వ్యవహరించాలని బెంచ్‌ సూచించింది. సమాచార హక్కు చట్టం కార్యకర్తలు సుభాష్‌ అగర్వాల్‌, అనిల్‌ బైర్వాల్‌ రాజకీయ పార్టీల వ్యవహారాల్లో జవాబుదారితనం, పార్టీలకు వివిధ వ్యవస్థల నుంచి సమకూరే ఆదాయ వనరుల వివరాలు వెల్లడిరచేలా ఆర్టీఐ చట్టం మేరకు ఆదేశించాలని సీఐసీకి ఆశ్రయించారు. వారి అప్పీలు మేరకు సీఐసీ ఆదేశాలు జారీ చేయడంపై ప్రజాస్వామికవాదులు హర్షం వ్యక్తం చేశారు.