ఆర్టీసీ సమ్మెతో ఆగిన బస్సులు
` జనం ఇక్కట్లు..
` డిపోల ముందు ధర్నాలతో కార్మికుల నిరసన
` నగరంలో అద్దె బస్సులను ఉచితంగా తిప్పిన ప్రభుత్వం
` చాన్నాళ్లకు ఆటోలు, క్యాబ్‌లకు పెరిగిన గిరాకీ
` కరీంనగర్‌లో లారీని ఢీకొట్టిన అద్దె బస్సు
` నగరంలో మెట్రో సర్వీసులను పొడగించిన సర్కార్
` కార్మికుల సమస్యలపై సానుకూలంగా ఉన్నాం: ఆర్టీసీ ఎండి
` ఆర్టీసీ సమ్మెకు బీఆరఎస్ సంఘీభావం
హైదరాబాద్(జనంసాక్షి):చాలాలకాలం తరవాత ఆర్టీసీ బస్సులు సేదదీరుతున్నాయి. సమ్మె కారణంగా అన్ని బస్సులు ఆయా డిపోలకే పరిమితం అయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో బస్ డిపోల్లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. డిపోల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలు చోట్ల పైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. కార్మికుల సమ్మెతో పెద్దపల్లిలో 150 బస్సులు డిపోనకే పరిమితమయ్యాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. మహబూబ్‌నగర్‌లో 112 బస్సులు డిపోనకే పరిమితం కాగా.. ప్రయాణికుల కోసం 16 విద్యుత్ బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఆర్టీసీ అద్దె బస్సులను నడుపుతోంది. కండక్టర్ లేకుండా వీటిని తిప్ప్పుతోంది. మరోవైపు బస్సులు లేక పలు చోట్ల పైవేట్ వాహనాలను ప్రయాణికులు ఆశ్రయిస్తున్నారు. అన్ని జిల్లాల వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచే బస్సులను డిపోలకు పరిమితం చేశారు. రహదారులపై బైఠాయించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉదయం నుంచి బస్సులన్నీ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహానగరంలో దాదాపు రోజుకు 25 లక్షల మంది ప్రజా రవాణాను వినియోగిస్తున్నారు. ఇదే అదనుగా వారు అధిక ఛార్జీలను వసూలు చేస్తున్నారు.కరీంనగర్‌లో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో పైవేటు డైవర్‌తో నడిపిస్తున్న అద్దె బస్సు లారీని ఢీకొట్టింది. కరీంనగర్‌లోకి కోతిరాంపూర్ బైపాస్ వద్ద బస్సు అదుపు తప్పడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. కాగా, శిక్షణ లేని డైవర్లతో బస్సులు నడిపిస్తుండటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీజీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మెతో హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మెట్రో రైళ్ల సంఖ్య, ఫ్రీక్వెన్సీ పెంచాలని నిర్ణయించారు. ఆర్టీసీ సమ్మె ముగిసేవరకూ 56 మెట్రో రైళ్లను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. మియాపూర్` ఎల్.బి.నగర్ కారిడార్‌లో 4 నిమిషాల 20 సెకన్ల విరామంతో, అలాగే నాగోల్` రాయదుర్గం కారిడార్‌లో 3 నిమిషాల 40 సెకన్ల విరామంతో రోజంతా గరిష్ఠంగా 56 రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. చివరి మెట్రో రైలు సర్వీస్ రాత్రి 11 గంటల తర్వాత కూడా పొడిగించేలా చర్యలు చేపట్టినట్లు మెట్రో అధికారులు పేర్కొన్నారు. అయితే, కార్మికుల సమ్మెతో నగరవాసులు మెట్రో రైళ్లపై ఆధారపడాల్సి వచ్చింది. ఉదయం నుంచి రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు తండోపతండాలుగా మెట్రోస్టేషన్లకు తరలివస్తున్నారు. పెరిగిన ప్రయాణికుల రద్దీ దష్ట్యా 56 మెట్రో రైళ్లను నడపాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు కార్మికుల సమ్మెపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కొన్ని సంఘాలు నిజాలను విస్మరించి కార్మికులను తప్ప్పుదోవ పట్టిస్తున్నాయని పేర్కొన్నారు. తెలంగాణలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్టీసీ జేఏసీ సమ్మె బాట పట్టింది. మంగళవారం నాడు అధికారులతో చర్చలు విఫలం కావడంతో ఆందోళనకు దిగారు ఆర్టీసీ కార్మికులు. బస్సులను డిపోలకే పరిమితం చేసి రోడ్లపై బైఠాయించి నిరసనలకు దిగారు. సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సమ్మె విరమించాలని కార్మికులను కోరుతోంది. ప్రయాణికుల ఇబ్బందుల దష్ట్యా బస్సులు నడపాలని సంబంధిత ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆర్టీసీ సమ్మెకు బిఆరఎస్ సంఘీభావం
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బీఆరఎస్ పార్టీ సంఘీభావం తెలిపుతుందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ గత కేసీఆర్ ప్రభుత్వంలోనే కేబినెట్ ఆమోదం తెలిపి, జీవో, గెజిట్ ఇచ్చామన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిందే అమలు చేయమని ఆర్టీసీ కార్మికులు అడుగుతున్నారన్నారు.రెండున్నరేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హావిÖలు అమలు చేయలేకపోవడం వల్లే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మహాలక్క్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి రూ.3000 కోట్లు ప్రభుత్వం బకాయిలు పడింది. దీంతో ఆర్టీసీ ఉద్యోగులకు డీఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేకపోతుందని విమర్శించారు. కార్మికులతో చర్చలు జరిపి వారి న్యాయబద్ధమైన కోరికలు నెరవేర్చాలన్నారు. తక్షణమే మహాలక్క్ష్మి బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
` డిమాండ్లు పరిష్కరించకుంటే సమ్మె మరింత ఉధతం
` నేడు ఆర్టీసీ డిపోల ఎదుట మహాధర్నాకు జేఏసీ నాయకుల పిలుపు
హైదరాబాద్(జనంసాక్షి): తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ టీజీఎస్ ఆర్టీసీ ప్రారంభించిన సమ్మెను నేటి నుంచి మరింత ఉదతం చేసేందుకు సన్నహాలు ప్రారంభించింది. గురువారం అన్ని ఆర్టీసీ డిపోల ఎదుట మహాధర్నాను నిర్వహించాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఉదయం 5 గంటల నుంచి ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం, యాజమాన్యం సమ్మె డిమాండ్లను పరిష్కరించకుండా మొండిగా వ్యవహరిస్తూ దాటవేత ధోరణి అవలంబిస్తూ, ప్రజలను ఆర్టీసీ కార్మిక వర్గాన్ని తప్ప్పుదారి పట్టిస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వం వేసిన కమిటీ అధికారులే ఇప్పటి కిప్ప్పుడు సమస్యలు పరిష్కరించలేమని చేతులెత్తేయడం వల్ల విధిలేని పరిస్థితుల్లో సమ్మెను ప్రారంభించ వలసి వచ్చిందని వెల్లడించారు. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హావిÖలలో ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేసేంతవరకు, 2021 వేతన సవరణ 30 శాతం తగ్గకుండా అమలు చేసేంతవరకు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పైవేట్ ఎలక్టిక్రల్ బస్సులను రద్దుచేసి ఇతర జోన్లకు ఉద్యోగులను బదిలీ చేసే ఉత్తర్వులను రద్దు చేసే వరకు తమ ఆందోళనను కొనసాగిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలు, అన్ని యూనిట్లు, అన్ని వర్క్ షాప్ లలో మహాధర్నాలను జయప్రదం జేయాలని జేసీసీ నాయకులు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటున్నారని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. బుధవారం విÖడియాతో మాట్లాడుతూ.. అమరవీరులకు నివాళులర్పించి సమ్మెను ముందుకు తీసుకెళ్తామని.. కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ఇచ్చిన హావిÖలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాలయాపన కోసమే ప్రభుత్వం కమిటీ వేసిందని విమర్శించారు. కమిటీ అవసరం లేదని.. తక్షణమే సమస్యలను పరిష్కరించాలని కోరినట్లు జేఏసీ చైర్మన్ తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే పక్రియను సర్కార్ వెంటనే ప్రారంభించాలని వెంకన్న డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగుతుందని.. వెనక్కి తగ్గమని స్పష్టం చేశారు. ప్రజా సంఘాలు సంపూర్ణంగా మద్దతిచ్చాయని… మరో సకల జనుల సమ్మెగా మారుస్తామని అన్నారు. సమ్మెకు మంద కష్ణ మాదిగ, బీసీ సంఘం నేత ఆర్.కష్ణయ్య మద్దతు ఇస్తున్నారని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం తమను చర్చలకు ఆహ్వానించాలని.. మరో సకల జనుల సమ్మె కాకుండా చూసుకోవాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న హెచ్చరించారు.
4.సమ్మె విరమించండి
చర్చించుకుందాం రండి..
` ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి
` సమ్మెతో సమస్యలు పరిష్కారం కావని హితవు
హైదారబాద్(జనంసాక్షి):ఆర్టీసీ సమ్మెను విరమించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సమస్యలకు సమ్మె పరిష్కారం కాదని ఆయన సూచించారు. సమస్యల పరిష్కారానికి నలుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసిందని.. 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించామని తెలిపారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తామనడం పొరపాటు అని స్పష్టం చేశారు.ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి వ్యతిరేకత లేదని పొన్నం ప్రభాకర్ తెలిపారు. అవన్నీ వెంటనే పరిష్కారమయ్యే అంశాలని పేర్కొన్నారు. ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలు రెండు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. ఈ రెండు అంశాల్లో పలు సాంకేతిక అంశాలు చరించాల్సి ఉందన్నారు. వీటిపై అధ్యయనం చేసేందుకే నాలుగు వారాల గడువు అడిగామని వివరించారు. ఈ రెండు అంశాలు కూడా సీఎం, డిప్యూటీ సీఎం దగ్గర చర్చిస్తామని అన్నారు. ఆర్టీసీ విలీనం ఆలస్యమైనప్పటికీ.. ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు వస్తున్నాయని పొన్నం ప్రభాకర్ తెలిపారు. గుర్తింపు సంఘాల ఎన్నికల విషయంలో నాయకుల మధ్య అంతర్యుద్ధం, నాయకత్వ అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్టీసీ ఇప్ప్పుడిప్ప్పుడే కోలుకుంటుందని.. అన్ని అంశాలను పరిష్కరిస్తామని చెప్పారు. మిమ్మల్ని ఎవరూ అడ్డుకోరని.. ప్రజాస్వామ్య పద్ధతిలో విÖ నాయకులు నిరసన తెలపవచ్చని.. ప్రజలపై ఒత్తిడి తీసుకురావచ్చని అన్నారు. అయితే పేద ప్రజల ప్రయాణాలకు ఇబ్బంది కలగజేయవద్దని విజ్ఞప్తి చేశారు. విÖ నాయకులు నిరసన తెలపవచ్చని.. మిగతా వారంతా విధుల్లో చేరి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరారు.



