ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన గణేష్‌కుమార్
శ్రీకాకుళం, జూలై 21 : శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారిగా జి.గణేష్‌కుమార్‌ను ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. 2009 గ్రూపు-1 బ్యాచ్‌కి చెందిన ఈయన జిల్లాలో డిప్యూటీ కలెక్టర్‌గా టెక్కలి, పాలకొండ డివిజన్‌లలో శిక్షణ పొందారు. అనంతరం రంపచోడవరం ఆర్డీవోగా నియమితులై అక్కడ పనిచేశారు. తర్వాత శ్రీకాకుళం ఆర్డీవోగా ప్రభుత్వం ఆయనను ఇక్కడకు నీయమించింది. దీంతో ఈమేరకు గణేష్‌కుమార్ ఇక్కడి ఆర్డీవో పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ ఆర్డీవోగా పని చేసిన జి.దామోదరరావుకు హైదరాబాద్‌కు రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించిన విషయం తెలిసినదే. బదిలీపై వెలుతున్న దామోదరరావు నుంచి గణేష్‌కుమార్ బాధ్యతలు తీసుకున్నారు.