కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌కు పెను ప్రమాదం తప్పింది. మంత్రి ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఈ ఘటన మానకొండూరు మండలం ఈదులగట్టుపల్లి వద్ద చోటు చేసుకుంది. ప్రమాదంలో మంత్రికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం మంత్రిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఈటెలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈటెల కాలు విరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ శ్రేణులు ఆసుపత్రికి చేరుకుని ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తున్నారు.