ఆర్థిక సహాయం అందజేసిన మోదుగుల మల్లేపల్లి సర్పంచ్ మర్ల ప్రేమలత వెంకటయ్య యాదవ్

 

 

 

 

 

 

 

 

కొండ మల్లేపల్లి అక్టోబర్ 20 జనం సాక్షి : చింతపల్లి మండలం మోదుగుల మల్లెపల్లి గ్రామస్తులు గడిగ యాదయ్య ఇంటి పైన పిడుగు పడి ఇంట్లో ఉన్న వస్తువులు , ఎలక్ట్రానిక్స్ ,నిత్యాసర వస్తువులు ఇంటి గోడలు నష్టపోవడం జరిగింది. ఆ గ్రామ సర్పంచ్ ప్రేమలత వెంకటయ్య గారి ద్వారా విషయం తెలుసుకొని శ్రీ పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ ముత్తుగారు 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. అదే గ్రామానికి చెందిన ఎండి. నజరుద్దీన్ గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. అది తెలుసుకొని చైర్మన్ ముత్తు గారు ఆసుపత్రుల ఖర్చులకోసం 10,000 పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు ఫౌండేషన్ సభ్యులు పుప్పాల పాపయ్య, మొగిలి కిషన్, భాసలక్ష్మణ్ పాల్గొన్నారు .ఆ గ్రామ పెద్దలు చైర్మన్ ముత్తు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.