ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మెరిట్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

మహబూబ్ నగర్ అర్ సి , అక్టోబర్ 9,(జనంసాక్షి ):
మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ ఏర్పడిన తర్వాత వ్యాపారాలు భారీగా పెరిగాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ప్రజలకు ఆస్తులు ఇవ్వలేకపోవచ్చు కానీ వారు కాపాడుకున్న ఆస్తుల విలువ మాత్రం ఊహించని విధంగా పెంచామని ఆయన అన్నారు.మహబూబ్ నగర్ క్రిస్టియన్ కాలనీలో ఉన్న ఆర్యవైశ్య హాస్టల్ లో జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో మెరిట్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పురస్కారాలను అందించారు.ఈ సందర్భంగా హాజరైన ఆర్యవైశ్యులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు… కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత మన జిల్లా పరిస్థితి అయిపోయిందని చాలామంది పేర్కొన్నారని, కానీ అప్పటినుంచే జిల్లా కేంద్రం ఎవరు ఊహించని విధంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతోందని ఆయన తెలిపారు. పట్టణంలో రోడ్లు, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించడంతో అభివృద్ధి సాధ్యమవుతోందన్నారు. మున్సిపల్ ఛైర్మన్ కొరమోని నర్సింహులు, ముడా ఛైర్మన్ గంజి వెంకన్న ముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రెహమాన్, వైస్ చైర్మన్ గణేష్, జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు పాలాది రామ్మోహన్, నాయకులు చెరుకుపల్లి రాజేశ్వర్, ఎదిరే ప్రమోద్ కుమార్, శ్యామ్, కుమారస్వామి, సాయికిషార్, భాస్కర్, కన్నయ్య, చక్రధర్ గుప్త, హేమలత,బాలామణి, కౌన్సిలర్లు రాషద్, శ్రీనివాస్ రెడ్డి, ప్రశాంత్, నాయకులు పాల్గొన్నారు.
Attachments area