ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు ఇన్నోవా వాహనాలు

8

హైదరాబాద్ : రాష్ట్రంలోని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు ఇన్నోవా వాహనాలను మంత్రి కేటీఆర్ అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వాటర్‌గ్రిడ్ పథకంలో భాగంగానే అధికారులకు ఇన్నోవా వాహనాలను అందజేశామని పేర్కొన్నారు. అధికారులకు హామీ ఇచ్చిన మేరకే సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. నిర్ణీత కాలంలో వాటర్‌గ్రిడ్ పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఇవాళ 20 ఇన్నోవా వాహనాలను అధికారులకు అందజేశారు.