ఆలయాలలో చోరీలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట

*మెదక్ ఎస్పీ రోహిణి
 ప్రియదర్శిని
తూప్రాన్ జనం సాక్షి అక్టోబర్  16:: ప్రముఖ ప్రాచీన
దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు మెదక్ ఎస్పి రోహిణి ప్రియదర్శిని తెలిపారు.తూప్రాన్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ  విలేకరుల సమావేశంలో ఆమె వివరించారు. మండల కేంద్రమైన వెల్దుర్తి వీరభద్ర స్వామి ఆలయంలో  ఈనెల 10న  మధ్య రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి ఆలయంలోకి ప్రవేశించి హుండీ పగులగొట్టి  సుమారు రూ.వెయ్యి దోచుకెళ్లారు. ఆలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు ఈనెల 14న వెల్దుర్తి ఎస్ఐ తన సిబ్బందితో కలిసి ఆరెగూడెం ఎక్స్ రోడ్డులో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, సుమారు మధ్యాహ్నం సమయంలో మెదక్ వైపు నుండి వచ్చిన మారుతీ కారును ఆపి పరిశీలించగా, నాలుగు ఇనుప కడ్డీలు, మరియు ఏడుగురు  అనుమానాస్పద వ్యక్తులు కనిపించారు. వెంటనే  వారిని పట్టుకుని  విచారించగా, విచారణలో నిందితులు (4) నేరాలు చేసినట్లు నిందితులు అంగీకరించినట్లు ఆమె తెలిపారు నిందితులు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారు  తమ జీవనోపాధి కోసం ఎటువంటి పని చేయకుండా విచ్చలవిడిగా   తిరుగుతూ,  ఖర్చులు మరియు అవసరాలకు డబ్బుల కొరకు అందరూ కలిసి దేవాలయాలలో దొంగతనాలు చేసి సులభంగా డబ్బు సంపాదించడానికి పథకం వేశారు. వారి పథకం ప్రకారం, నిందితులు వారి గ్రామస్థుడి నుండి నంబర్ ఆర్.జె.09 యు.బి. 0770 గల మారుతీ  వాహనాన్ని తీసుకొని, తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఆలయాల్లో నేరాలకు పాల్పడ్డారు. వెల్దుర్తి ఆంజనేయ స్వామి ఆలయంలో, మాచారం రామాలయంలో,
బొంతపల్లిలోని వీరభద్ర స్వామి ఆలయంలో, శెట్టిపల్లి కలాన్ వీరభద్ర స్వామి ఆలయంలో దొంగతనం చేసినట్లు వివరించారు రాజస్థాన్ కు చెందిన రాజు పండిత్, దేవిలాల్ రెగ్గర్, మిట్టు లాల్ నాయక్,  దేవి లాల్ రావత్, ఈశ్వర్ నాయక్, రాంలాల్ సాల్వి అనే ఏడుగురు నిందితులను అరెస్టు చేసి మొత్తం రూ. 21,091 నగదు నిందితుల నుండి రికవరీ చేశారు ఏడుగురుని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు విలేకరుల సమావేశంలో తూప్రాన్ డిఎస్పి యాదగిరి రెడ్డి సీఐ శ్రీధర్ ఎస్సై సురేష్  కుమార్ , వెల్దుర్తి ఎస్ఐ మధు గౌడ్ పాల్గొనగా నిందితులను పట్టుకోవడంలో కృషిచేసిన ఐడి పార్టీ నలుగురికి పోలీసులు  చొప్పున మెదక్ ఎస్పీ నర్సింగ్ రావు వెంకట్ సిబ్బందికి రివార్డ్ పంపిణీ చేశారు
Attachments area