ఆల్ ఇండియా ఇమామ్ కౌన్సిల్ కమిటీ ఎన్నిక
బిచ్కుంద జనవరి 13 (జనంసాక్షి) జుక్కల్ నియోజకవర్గం పరిధిలోని బిచ్కుంద మండలంలో గల పత్లాపూర్ గ్రామంలో ఆదివారం నాడు ఆల్ ఇండియా ఇమామ్ కౌన్సిల్ కమిటీని నూతనంగా ఎన్నుకున్నారు. పత్లాపూర్ గ్రామంలో గల ఫైజుల్ ఖురాన్ మదర్సాలో ముస్లింలు ఇస్లాం జల్సా ఏర్పాటు చేశారు. ఈ ఇస్లాం జల్సాలో ముఖ్య అతిథులుగా నూతన కమిటీని ఎన్నుకొవడానికి హైదరాబాదు నుండి మౌలానా బషీర్ అహ్మద్ అష్రఫ్ హాష్మి, కర్ణాటక రాష్ట్రం గుల్బర్గ నుండి మొహ్మద్ యూసుఫ్ రషది, జహీరాబాద్ నుండి ముఫ్తీ అబ్దుల్ గఫార్, మౌలానా నిజాముద్దీన్ పాల్గొన్నారు. ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం పేద పిల్లల పెళ్లిలకు ఆర్థికంగా ఆదుకోవడం, ఒంటరి మహిళలకు, పేదలకు తగు సహాయం చేయడానికి అని కమిటీ నిర్వాహకులు తెలియజేశారు. ఆల్ ఇండియా ఇమామ్ కౌన్సిల్ కమిటీ అధ్యక్షుడిగా బిచ్కుంద మౌలానా అబ్దుల్ రహీమ్, ఉపాధ్యక్షులుగా పిట్లం ముఫ్తీ జమ్షెద్, మౌలానా రబ్బాని, సెక్రటరీగా బిచ్కుంద రిజ్వాన్ మౌలానా, జనరల్ సెక్రటరీగా రాజుల్లా హఫీజ్ మహమ్మద్ మోయిన్ అక్బర్ మరియు క్యాషియరుగా మద్నూర్ ముఫ్తీ అబ్దుల్ అజీజ్ లను ఎన్నుకున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, మదర్సా విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.