ఆశాజనకంగా వ్యవసాయం

రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించాలి

ఉన్నతస్థాయి సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్ (జనం సాక్షి )

ఆలస్యమైనా వర్షాలు సాగుకు సహకరిస్తున్నాయి.వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి .. వరి నాట్లు జోరందుకున్నాయి. గోదావరి పరివాహక ప్రాంతం, కృష్ణా పరివాహక ప్రాంత సాగునీటి లభ్యతపై ఇప్పటికే ఒకసారి సీఎం  ఉన్నతస్థాయిలో, రెండు సార్లు శాఖ తరపున సమీక్ష చేశాం. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించాలి. ముఖ్యంగా స్వల్పకాలిక పంటల సాగుపై చైతన్యం చేయాలి.శాస్త్రవేత్తల సూచన ప్రకారం కంది, పత్తి పంటలను మరో వారం రోజుల వరకు విత్తుకోవచ్చు.మొక్కజొన్న పంట సాగుకు ఈ వర్షాలు ఈ నెలాఖరు వరకు అనుకూలం.ఇదివరకే వరి నారు అందుబాటులో ఉన్న రైతులు ఈ అదును నేపథ్యంలో వెంటనే నాట్లు పూర్తి చేసుకోవాలి.నేరుగా విత్తుకునే స్వల్పకాలిక వరి రకాలపై దృష్టి సారించాలి.దీనిమూలంగా పంట ఖర్చులు, సాగు కాలం కలిసి వస్తుంది.రైతులకు అవసరం అయిన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయి.నిన్నటి వరకు కురిసిన వర్షాలతో రాష్ట్రంలో వర్షపాతం సాధారణ స్థాయికి చేరుకున్నది.వాతావరణ శాఖ సూచనల ప్రకారం మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నది.తెలంగాణ 32 జిల్లాలలో ఆయిల్ పామ్ సాగుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయి.ఈ ఏడాదిలో కొత్తగా వచ్చిన ఐదు జిల్లాలతో కలిపి 2.30 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యం.గత ఏడాది అధిక వర్షాల మూలంగా ఆయిల్ పామ్ సాగుకు ఆటంకాలు.ఈ ఏడాది అన్నీ సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఇప్పటికే 11 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ మొక్కలు నాటడం పూర్తి.75 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ మొక్కలు నాటు కోవడానికి ఆన్ లైన్ రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.దీనికి సంబంధించి రైతులకు అందాల్సిన రాయితీలన్నీ అందుబాటులో ఉన్నాయి.అధికారులు ఆయిల్ పామ్ సాగుకు రైతులను మరింత ప్రోత్సహించాలి.నూతనంగా ఆయిల్ పామ్ సాగుకు ఎంపిక చేసిన జిల్లాలలో వెంటనే ఇతర జిల్లాల నర్సరీల నుండి మొక్కలు ఇచ్చి వెంటనే నాట్లు వేయించాలి.రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటికి 65 లక్షల ఎకరాలలో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు.హైదరాబాద్ సచివాలయంలోని వ్యవసాయ శాఖా మంత్రి కార్యాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , హాజరైన వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కమీషనర్ హన్మంతు కొండిబ, అదనపు సంచాలకులు విజయ్ కుమార్, అగ్రోస్ ఎండీ రాములు, ఉద్యాన శాఖ జేడీ సరోజిని తదితరులు.

తాజావార్తలు