ఆశ కార్యకర్తలకు కనీస వేతనం చెల్లించాలి

మండల కేంద్రంలోని పి హెచ్ సి దగ్గర ధర్నా
పానుగల్ డిసెంబర్ 05,జనంసాక్షి
ఆశ కార్యకర్తలకు కనీస వేతనం 26000 చెల్లించాలని, పని భారం తగ్గించాలని మండల కేంద్రంలోని పి హెచ్ సి దగ్గర ధర్నానిర్వహించారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సూర్యవంశం రాము మాట్లాడుతూ, ఆశా కార్యకర్తలకు కనీస వేతనం 26వేల రూపాయలు చెల్లించాలని, ఈ లోపు ఆంధ్ర ప్రదేశ్ లో ఇస్తున్నట్లు ఫిక్స్డ్ వేతనం 10000 రూపాయలు వెంటనే నిర్ణయం చేయాలని, 2022 డిసెంబర్ 6 నుండి లే ప్రసి సర్వేకు ప్రభుత్వం అదనంగా డబ్బులు చెల్లించాలని, 2023 జనవరి 18 నుంచి నిర్వహించె కంటి వెలుగు కార్యక్రమానికి అదనంగా డబ్బులు చెల్లించాలని, గతంలో ఆశలు నిర్వహించిన లెప్రసీ మరియు కంటి వెలుగు పెండింగ్ డబ్బులను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ కోరుతున్నాం, ఆశలకు పనిభారం తగ్గించాలి జాబ్ చార్ట్ ను విడుదల చేయాలి, కేంద్రం చెల్లించిన కరోనా రిస్క్ అలవెన్స్ నెలకు 1000 చొప్పున 16 నెలల బకాయిల డబ్బులు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం, 32 రకాల రిజిస్టర్స్ ప్రింట్ చేసి ప్రభుత్వం సప్లై చేయాలని,ఆశలు రిజిస్టర్స్ కోసం పెట్టిన ఖర్చులు చెల్లించాలని,క్వాలిటీతో కూడిన ఐదు సంవత్సరాల పెండింగ్ యూనిఫామ్స్, పోస్టులు వెంటనే భర్తీ చేయాలని,ఆశా కార్యకర్తలకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం ఉద్యోగ భద్రత కల్పించాలని,అధికారుల వేధింపులను అరికట్టాలనే డిమాండ్ల సాధన కోసం ఈనెల 15 ,16 తేదీల్లో వనపర్తి కలెక్టరేట్ కార్యాలయం ముందు 48 గంటల వంట వార్పు కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లాలో ఉన్నటువంటి ఆశా కార్యకర్తలు అందరు హాజరుకావాలని సమస్యల పరిష్కారం కోసం సిఐటియు నిర్వహించే పోరాటంలో కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు సుజాత శ్యామల రామేశ్వరమ్మ రేణుక మహేశ్వరి,రజిత,సంధ్య,మండలంలోని అన్ని గ్రామాల ఆశా కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

తాజావార్తలు