ఆసరాలో అనర్హుల వివరాలివ్వండి
అవినీతి జరిగితే టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేయండి
అధికారులకు, ప్రజాప్రతినిధులకు మంత్రి కేటీఆర్ లేఖ
హైదరాబాద్,ఫిబ్రవరి6(జనంసాక్షి): పేదలకోసం చేపట్టిన అసరా పథకాన్ని మరింత పారదర్శకంగా,పటిష్టంగా అమలుచేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా ఈ పథకంలో ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబర్‌ను ప్రవేశ పెట్టారు. నిరుపేదలకి పించన్లు అందిస్తూ ఆసరా నిలబడుతున్న ఆసరాలో పధకంలో అవినీతికి పాల్పడే వ్యక్తులు, అధికారులు, అనర్హుల వివరాలు తెలపాలంటు పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు పిలుపునిచ్చారు. ఈమేరకే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులకి లేఖ రాసారు. అసరా పధకం లక్ష్యాన్ని, అమలుని వివరించారు. తెలంగాణ నిరుపేదల సంక్షేమం లక్ష్యమని, సాంఘిక భద్రత కల్పించడానికి, పేద ప్రజలు సగౌరవంగా బతికేందుకే ఆసర పథకమని వివరించారు. ఇప్పటిదాకా 28లక్షల లబ్దిదారులకు పించన్ల మంజూరు చేసామని, ఇందుకోసం ప్రతి ఎటా నాలుగు వేల కోట్లు ఖర్చవుతున్నా వెనుకాడడం లేదని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పించన్లు, అందుకే అర్హుల గుర్తింపు పక్రియ ఇంకా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పించన్లు ఇస్తామని తెలిపిన మంత్రి, అనర్హులైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈమేరకి అసరలో అనర్హులు ఉన్నా,అవినీతి జరిగినా వివరాలు ఇవ్వాలని అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈవివరాలను తెలిపేందుకు ఒక టోల్‌ప్రీ నెంబర్‌తో పాటు ఈ-మెయిల్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రి నెంబర్ 18002001001, ఫిర్యాదులు ఇవ్వాలని కోరారు. దీంతో పాటు నేరుగా సెర్ప తెలంగాణ సీఇఓ కి వివరాలు పంపవచ్చని తెలిపారు. సమాచారం, ఫిర్యాదు చేసిన వారి పేర్లు గోప్యంగా ఉంచబడుతాయన్నారు. న తెలంగాణ ప్రభుత్వం, నిరుపేదల సంక్షేమం, సాంఘిక భద్రత కల్పించడంలో భాగంగా పేదలందరు గౌరవంగా, సురక్షితంగా జీవితం గడపాలన్న దృష్టితో ఆసరా ఫించన్ల పధకాన్ని చేపట్టిందని లేఖలో పేర్కొన్నారు. సమాజంలో అత్యంత నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్దులు, వితంతువులు,చేనేత కార్మికులు, కల్లగీత కార్మికులు, ఎయిడ్స్ బాధిత వ్యక్తులు, వికలాంగుల రోజు వారీ కనీస అవసరాలు తీర్చడం, వారికి సహకారం అందించడం ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యం. పెరుగుతున్న రోజువారీ ఖర్చులను దృష్టిలో ఉంచుకొని పేద వితంతువులకు, చేనేత కార్మిలకు, కల్లుగీత కార్మికులకు, వృద్దులకు పించన్ మొత్తాన్ని 200/- నుంచి 1000/- కు పేద వికలాంగులకు పించన్ మొత్తాన్ని 500/- నుంచి 1500/- లకు పెంచింది. జిల్లాల వారిగా పించను కోసం ధరఖాస్తు చేసుకున్న జాబితాలను పరిశీలించి, అధికారుల ద్వారా అర్హులైన వారిని గుర్తించి ఆసరా పధకాన్ని అమలుచేస్తున్నాము. ఇప్పటి వరకు రాష్ట్రంలో 28 లక్షల అర్హులైన లబ్దిదారులకు మంజురు చేయడం జరిగింది. ఆసరా పధకానికి గాను సంవత్సరానికి దాదాపు 4000/-కోట్లు ఖర్చు అవుతున్నప్పటికి మన ప్రభుత్వం వెనకాడడం లేదు. గత మూడు నెలలనుంచి ఫించన్లను అర్హులైన వారందరికి పంపిణీచేసాం. అర్హులైన పేదవారందరికి ఈ పించన్లలను మంజూరు చేయాలని ప్రభుత్వం ధృడనిశ్చయంతో వుంది అందుకే అర్హులైన వారి గుర్తింపు పక్రియ ఇంకా కొనసాగిస్తున్నాము. అంతేకాక కొంతమంది అనర్హులు కూడా ఈ పధకంలో మంజూరు పొందినట్టుగా ప్రభుత్వం దృష్టికి వచ్చినందున అనర్హులని తొలగించడానికి కూడా చర్యలు చేపడుతున్నాం. ఈ పథకాన్ని మరింత పటిష్టంగాను అమలు పరచడానికి సమాజంలోని అన్ని వర్గాల నుంచి సలహాలు,సూచనలు అలాగే ఈవివరాలను తెలిపేందుకు ఒక టోల్‌ప్రీ నెంబర్‌తో పాటు ఈ-మెయిల్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశామని లేఖలో వివరించారు. ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో అర్హులైన లబ్దిదారులందరికి ఆసరా పించన్ అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది. అలాగే అనర్హులను పధకానికి దూరంగా ఉంచి, అర్హులైనవారికి నెలనెల పించన్ మొత్తము అందేందుకు విూరందరు పూర్తి సహకారాన్ని అందించాలని మనవి చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.